లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించడం మరియు ఇటీవల సల్మాన్ సన్నిహితుడు, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో ఈ గ్యాంగ్ గురించి మరింత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, సోమీ అలీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా లారెన్స్ బిష్ణోయ్‌ను ప్రస్తావిస్తూ చేసిన పోస్టు హాట్ టాపిక్ అయింది, మరియు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Somy Ali Post
“నమస్తే లారెన్స్ బిష్ణోయ్. జైలు నుండి కూడా మీరు జూమ్ కాల్స్ చేస్తారని నాకు తెలిసింది. మీతో కొన్ని విషయాలు చర్చించాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఎలా సంప్రదించాలో చెప్పండి. ఈ ప్రపంచంలో రాజస్థాన్ నాకు ఇష్టమైన ప్రదేశం. మీతో జూమ్ కాల్‌లో మాట్లాడిన తర్వాత అక్కడికి వెళ్లాలని అనుకుంటున్నాను. నన్ను నమ్మండి, ఇది మీ మంచికే. మీ మొబైల్ నంబర్ ఇస్తే సంతోషిస్తాను” అని సోమీ ఆలీ పేర్కొన్నారు. అలాగే, ఆమె లారెన్స్ బిష్ణోయ్ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్ జైల్‌లో ఉన్నాడు.
పాకిస్తాన్-అమెరికన్ నటి సోమీ అలీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. గతంలో సల్మాన్‌తో నటించినప్పుడు ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి, కానీ ఆ తర్వాత వారు విడిపోయారు. సల్మాన్‌పై సోమీ తీవ్ర ఆరోపణలు కూడా చేసింది: “సల్మాన్ అమ్మాయిలను కొట్టేవాడు. ఆయనను అభిమానించడం మానండి. అతను శాడిస్ట్, మానసిక రోగి” అని సోషల్ మీడియాలో తెలిపింది. అయితే, ఆ పోస్టు వైరల్ అయిన తర్వాత ఆమె దాన్ని తొలగించింది.
Somi Ali Interesting Comments On Salman Khan