Site icon HashtagU Telugu

Boycott Maldives : ‘బాయ్‌కాట్‌ మాల్దీవ్స్’.. సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతోంది ?

Boycott Maldives

Boycott Maldives

Boycott Maldives : ‘బాయ్‌కాట్‌ మాల్దీవ్స్’.. ఇదే ఇప్పుడు సోషల్‌ మీడియాలో  ట్రెండ్ అవుతోంది. ప్రత్యేకించి ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఇది నెటిజన్స్‌లోకి చొచ్చుకుపోతోంది. దీనిపై సోషల్ మీడియా యూజర్స్ యాక్టివ్‌గా స్పందిస్తున్నారు.  మాల్దీవులపై భారతీయులకు ఆగ్రహం ఇంతలా కట్టలు తెంచుకోవడానికి  ఒక కారణం ఉంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్‌లో పర్యటించారు.  ఆ టూర్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో మాల్దీవులు, లక్ష్యద్వీప్‌ మధ్య పోలికల గురించి సోషల్ మీడియా వేదికల్లో డిస్కషన్ మొదలైంది. దీంతో మాల్దీవ్స్ కంటే లక్ష్యద్వీపే టూర్‌కు బెస్ట్ ఏరియా అని అనుకోవడం స్పీడు పుంజుకుంది.  దీనిపై ట్విట్టర్‌లో నెటిజన్స్ మధ్య చర్చ కూడా బాగానే జరిగింది. ఈ పరిణామంతో షాక్‌కు గురైన మాల్దీవుల మంత్రి అబ్దుల్లా మహమ్మద్ మజీద్  తన అక్కసును వెళ్లగక్కారు. తమ దేశంలా టూరిస్టులకు ఆతిథ్యాన్ని ఇండియా ఇవ్వలేదు అని కామెంట్ చేశారు. టూరిజంలో మాల్దీవులతో ఇండియా పోటీపడలేదని వ్యాఖ్యానించారు.  అబ్దుల్లా మహమ్మద్ మజీద్  దీనిపై ట్విట్టర్‌లో పోస్టు కూడా పెట్టాడు.  అంతటితో ఆగకుండా ప్రధాని నరేంద్ర మోడీకి సైతం ట్వీట్‌ను(Boycott Maldives) ట్యాగ్‌ చేశారు.

ఇండియాలోని హోటళ్ల గదుల్లో కంపు :జాహిద్‌ రమీజ్‌

లక్షద్వీప్‌లో పర్యాటకాన్ని పెంపొందించడంపై మాల్దీవుల ఎంపీ జాహిద్‌ రమీజ్‌ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు.  బీచ్ టూరిజంలో మాల్దీవులతో పోటీపడటంలో భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పారు. ఇది మంచి అడుగే, కానీ మాతో పోటీపడడం భ్రమ అంటూ కామెంట్‌ చేశారు. మాల్దీవుల్లాంటి సేవలను భారత్‌ ఎలా అందించగలదని ప్రశ్నించారు. ‘‘మా దేశం అందించే సర్వీస్‌ను ఇండియా ఎలా అందించగలదు ? పరిశుభ్రంగా ఎలా ఉంచగలదు? అక్కడి హోటళ్ల గదుల్లో వచ్చే వాసన పెద్ద సమస్య’’ అంటూ ట్వీట్‌‌లో రమీజ్‌ రాశాడు.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో భారతీయ నెటిజన్లకు మాల్దీవులపై  ఆగ్రహం పెరిగింది. టూరిజంపై ఆధారపడ్డ మాల్దీవులకు భారత్‌ బలం ఏంటో తెలియదని నెటిజన్స్  ఫైర్ అవుతున్నారు. ఫిబ్రవరి 2న తన పుట్టిన రోజున మాల్దీవులకు వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నానని.. అయితే ఇప్పుడు రద్దు చేసుకున్నానని ఓ ట్విట్టర్ యూజర్‌ పోస్టు పెట్టాడు. రూ.5లక్షలు పే చేసి మూడువారాల పాటు మాల్దీవుల్లో బస చేసేందుకు హోటల్‌ను బుక్‌ చేసుకున్నానని.. మాల్దీవుల మంత్రి ట్వీట్‌ను చూసిన తర్వాత టూర్‌ను రద్దు చేసుకున్నానని ఇంకో యూజర్‌ రాసుకొచ్చాడు. మాల్దీవుల మంత్రి భారత్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో 8166 హోటల్‌ బుకింగ్స్‌, 2500 విమాన టికెట్లు రద్దయినట్లు తెలుస్తోంది.

Also Read: Kite festival: అహ్మదాబాద్‌లో కైట్ ఫెస్టివల్ సందడి.. హైదరాబాద్‌లో ఎప్పటి నుంచి అంటే..

Exit mobile version