Site icon HashtagU Telugu

Snake Bite: ఆ వ్యక్తికి 15 ఏళ్లలో 500 సార్లు పాముకాట్లు.. ఇప్పుడతను ఎలా ఉన్నాడంటే..?

90

90

మీరు ఇప్పుడు రోమాలు నిక్కబొడుచుకునే ఓ సంఘటన గురించి చదవబోతున్నారు. హా.. అని నోరళ్లబెట్టి ఆశ్చర్యపోయే ఒక ఉదంతం గురించి తెలుసుకోబోతున్నారు. ఆశ్చర్యంతో, అనుమానంతో, భయంతో కూడుకున్న ఘటన ఇది. ఒక వ్యక్తిని పాము కాటేసిందంటే.. అది ప్రమాదవశాత్తూ జరిగిందని అనుకోవచ్చు. అదే రెండుమూడు సందర్భాల్లో కాటేస్తే.. ఏం జరిగిందా అని ఆలోచిస్తారు. కానీ ఒకే వ్యక్తి ఏకంగా 500 సార్లు పాముకాటుకు గురయ్యాడు అంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. అతడి పేరే తుకారం.

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు వెళితే తుకారాం గైక్వాడ్ గురించి అందరూ వింతగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆయన 500 సార్లు పాముకాట్లకు గురయ్యాడు. నిజానికి తుకారాం.. కేవలం ఓ సాధారణ వ్యవసాయ కూలీ. పొలాల్లో పనిచేసేవారికి పాముకాటు ఎప్పుడూ పొంచే ఉంటుంది. అందుకే వాళ్లు తగిన జాగ్రత్తలను తీసుకుంటూ.. భయపడకుండా పనిచేస్తారు. కానీ ఒక్కోసారి దురదృష్టవశాత్తూ పాముకాటుకు గురవుతుంటారు. తుకారాం పరిస్థితి కూడా ఇదే.

పొలాల్లో పనిచేసేటప్పుడు పాము కాటేసిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ జనం మధ్య ఉండేటప్పుడు కూడా తుకారం చాలాసార్లు పాముకాటుకు గురయ్యాడు. అంతమంది ఉండగా.. కేవలం తుకారాంనే టార్గెట్ చేసుకుని మరీ వివిధ సందర్భాల్లో పాములు ఎందుకు కాటేస్తున్నాయి అంటే వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు. మామూలుగా అయితే ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా ఆకర్షిస్తాయని.. వారిని ఎక్కువగా కుడతాయని అంటారు. మరి పాములను కూడా అలా ఆకర్షించేది ఏమైనా ఉంటుందా?

ఇప్పటికే దాదాపు 500 సార్లు పాముకాట్లకు గురవ్వడంతో తుకారాం పరిస్థితి దారుణంగా తయారైంది. ఆరోగ్యం క్షీణిస్తోంది. కొన్నిసార్లు ఐసీయూలో ఉంచి ట్రీట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అయినా పాములు.. పదే పదే ఒకే వ్యక్తిని ఎందుకు కాటేస్తున్నాయో వైద్యరంగం కూడా చెప్పలేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే.