ఒక మహిళ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కోసం వెతుకుతోంది. ఆమె డేటింగ్ యాప్‌లో భాగస్వామి కోసం వెతుకుతోంది. కానీ గత 3 సంవత్సరాలుగా ఇష్టమైన వ్యక్తిని కనుగొనలేకపోయింది. అంతేకాదు ఇప్పటి వరకు ఆమె 1000 మందికి పైగా రిజెక్ట్ చేసింది. డేటింగ్ యాప్‌లో వేల సంఖ్యలో ప్రొఫైల్ మ్యాచ్‌లు చూసినప్పటికీ, ఏ ఒక్కరిని పెళ్లి చేసుకోలేదు. ఆమె మెచ్చిన లక్షణాలు ఇతరుల్లో లేకపోవడమే అందుకు కారణం. ఈ 41 ఏళ్ల ఫారిన్ క్లైర్ ప్రస్తుతం ఒంటరి తల్లిగా జీవితాన్ని గడుపుతోంది. 2020 సంవత్సరంలో తన భర్తతో విడిపోయింది. ఈ సంబంధంలో ఒక కుమార్తె కూడా పుట్టింది.
అయితే విడిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత, క్లైర్ సరైన భాగస్వామి అవసరమని భావించింది. ఇలాంటి పరిస్థితుల్లో డేటింగ్ యాప్స్ వైపు మొగ్గు చూపింది. అయితే అప్పటి నుంచి నేటి వరకు ఆమెకు ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ఆమె జీవితంలోకి రాలేదు. ఆమె అన్వేషణ గత 3 సంవత్సరాలుగా కొనసాగుతోంది. వృత్తి రీత్యా సింగర్ క్లైర్ తన జీవితంతో రాజీ పడకూడదని చెప్పింది.
అందుకే డేటింగ్ యాప్‌లో 1000 మంది మగవాళ్లను కాంటాక్ట్ అయినప్పటికీ, ఎవరితోనూ డేటింగ్ చేయలేదు. టిండర్, ఫేస్‌బుక్ వంటి అనేక యాప్‌లలో తన ప్రొఫైల్‌ను పెట్టినా సరైన భాగస్వామి దొరకలేదట. క్లైర్ తన భవిష్యత్ జీవిత భాగస్వామి షరతులు లేని ప్రేమను అందించే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటుంది. మధ్య వయస్కుడు ఉండి, ఎత్తు 6 అడుగులు ఉండాలి, ఎందుకంటే క్లైర్ కూడా 5 అడుగుల 8 అంగుళాల పొడవు ఉంటుంది. అతను రాత్రిపూట ఎక్కువ తిరిగేవాడు కాకూడదని కండీషన్ కూడా పెట్టింది.