Shubh Muhurat : పెళ్లిళ్లు, శుభకార్యాలు, వాహనాల కొనుగోలుకు శుభ ముహూర్తాలివీ

Shubh Muhurat : జనవరి నెలలో శుభకార్యాలు, పెళ్లిళ్లకు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి.

  • Written By:
  • Updated On - January 3, 2024 / 07:32 AM IST

Shubh Muhurat : జనవరి నెలలో శుభకార్యాలు, పెళ్లిళ్లకు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి.  వాహనాల కొనుగోలుకు కూడా చాలా రోజుల్లో మంచి ఘడియలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సంవత్సరం జనవరి 15న మకర సంక్రాంతి వస్తుంది. ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకోవడానికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. సూర్యుడు ఈ నెలలో మకర రాశిలోకి ప్రవేశించడంతో ఖర్మాలు కూడా ముగుస్తాయి. ఖర్మాల సమయంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఖర్మాలు ముగిసిన తర్వాత అన్ని శుభకార్యాలు జరుగుతాయి.

We’re now on WhatsApp. Click to Join.

జనవరిలో పెళ్లికి మంచి ముహూర్తాలు ఇవీ..

  • జ్యోతిష్యుల ప్రకారం.. జనవరి 16 నుంచి పెళ్లిళ్ల సందడి మొదలవుతుంది.
  • జనవరి 16న పెళ్లికి మంచి ముహూర్తం ఉంది. ఆ రోజున ఉత్తర భాద్రపద, రేవతి నక్షత్రం .
  • జనవరి 17న పెళ్లికి ముహూర్తం ఉంది. ఆ రోజు తిథి సప్తమి. అలాగే నక్షత్రమండలం రేవతి.
  • జనవరి 21న మంచి పెళ్లి ముహూర్తం ఉంది. ఆ రోజు ద్వాదశి తిథి. నక్షత్రాలు రోహిణి, మృగశిర.
  • జనవరి 22న పెళ్లికి మంచి ముహూర్తం ఉంది. ఈ రోజును ప్రదోష వ్రతంగా జరుపుకుంటారు. నక్షత్రరాశి మృగశిర.
  • జనవరి 27న పెళ్లికి మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు మాఘ మాసంలోని కృష్ణ పక్షం రెండో రోజు. నక్షత్రరాశి మాఘం.
  • జనవరి 28న పెళ్లికి మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు మాఘ మాసంలోని కృష్ణపక్షంలో మూడో రోజు. నక్షత్రరాశి మాఘం.
  • జనవరి 30న కూడా పెళ్లికి మంచి ముహూర్తం ఉంది. ఈ రోజు కృష్ణపక్షంలో ఐదో రోజు.  ఉత్తర ఫల్గుణి, హస్త నక్షత్రం.
  • జనవరి నెలలో చివరి పెళ్లి ముహూర్తం జనవరి 31న కూడా ఉంది. ఆ రోజు తిథి పంచమి, షష్టి తిథి. నక్షత్రమండలం హస్తం.

Also Read: Jaggery in Winter: చలిని తట్టుకోలేకపోతున్నారా ? బెల్లంతో వీటిని కలిపి తినండి..

జనవరిలో వాహనాల కొనుగోలుకు శుభ ఘడియలివీ.. 

  • ఇవాళ (బుధవారం – జనవరి 3) రాత్రి 7:48 నుంచి గురువారం ఉదయం 7:15 వరకు వాహనం కొనుగోలుకు శుభ సమయం ఉంది. తిథి అష్టమి, నక్షత్రం హస్తం.
  • జనవరి 4న ఉదయం 7:15 నుంచి రాత్రి 10:4 వరకు వాహన కొనుగోలుకు బెస్ట్ టైం. తిథి అష్టమి.. నక్షత్రం హస్త, చిత్ర.
  • జనవరి 7న ఆదివారం రాత్రి 10:08 నుంచి సోమవారం మధ్యాహ్నం 12:46 వరకు వెహికల్ కొనడానికి మంచి టైం. తిథి ఏకాదశి, నక్షత్రం అనురాధ.
  • జనవరి 14న ఆదివారం ఉదయం 7.15 నుంచి ఉదయం 7.59 వరకు వాహనం కొనేందుకు శుభ సమయం ఉంది. తిథి చతుర్థి, తృతీయ.. నక్షత్రం ధనిష్ఠ.
  • జనవరి 15న సోమవారం ఉదయం 7.15 నుంచి ఉదయం 8.07 వరకు బెస్ట్ టైం. తిథి పంచమి.. నక్షత్రం పూర్వ భాద్రపద, శతభిష.
  • జనవరి 17న బుధవారం రాత్రి 10:06 నుంచి గురువారం మధ్యాహ్నం 3:33 వరకు మంచి ఘడియలు ఉన్నాయి. తిథి అష్టమి, నక్షత్రం రేవతి.
  • జనవరి 21న ఆదివారం రాత్రి 7:41 నుంచి 7:26 వరకు వాహనం కొనేందుకు బెస్ట్ టైం. తిథి  ఏకాదశి, నక్షత్రం రోహిణి.
  • జనవరి 22న సోమవారం రాత్రి 7:51 నుంచి జనవరి 23న ఉదయం 4:58 వరకు మంచి సమయం ఉంది. తిథి త్రయోదశి, నక్షత్రం మృగశిర.
  • జనవరి 24న బుధవారం రాత్రి 9:49 నుంచి జనవరి 25న ఉదయం 7:13 వరకు శుభ సమయం ఉంటుంది. తిథి పూర్ణిమ పునర్వసు.. నక్షత్రం పునర్వసు.
  • జనవరి 25న గురువారం రాత్రి 7:13 గంటల నుంచి శుక్రవారం ఉదయం 7:12 గంటల వరకు వాహనం కొనేందుకు బెస్ట్ టైం. తిథి పూర్ణిమ, నక్షత్రం పునర్వసు, పుష్య.
  • జనవరి 26న శుక్రవారం రాత్రి 7:12 నుంచి 10:28 వరకు వాహనం కొనేందుకు బెస్ట్ టైం. తిథి ప్రతిపద, నక్షత్రం పుష్య.
  • జనవరి 31న బుధవారం ఉదయం 7:10 నుంచి ఫిబ్రవరి 1న ఉదయం 7:10 వరకు శుభ సమయం ఉంది. తిథి పంచమి, షష్ఠి.. నక్షత్రం హస్త, చిత్ర.
గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుంచి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాన్ని వినియోగదారులు కేవలం సమాచారంగా తీసుకోవాలి.