మణిపూర్ అల్లర్లలో రోజురోజుకు షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. కేవలం మూడు నెలల్లో 30 మంది మిస్సింగ్ అయ్యారు. అందులో ఆడవాళ్లు కూడా ఉన్నారు. అల్లర్ల నేపథ్యంలో 30 మంది అదృశ్యమైనట్లు ఫిర్యాదులు అందడంతో 6000కు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా మరో విద్యార్థి మిస్సింగ్ ఉదంతం సంచలనంగా మారింది. మణిపూర్ రాష్ట్రంలో మరణాలు, విధ్వంసం తర్వాత మిస్సింగ్ కేసుల సంఖ్య చాలా ఆందోళనకరంగా ఉంది. గత 3 నెలల్లో మొత్తం 30 మందిపై 6000 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.
మే 6న జర్నలిస్టు సమరేంద్ర సింగ్ (47) తన స్నేహితుడు కిరణ్ కుమార్ సింగ్‌తో కలిసి అల్లర్లు జరిగిన తర్వాత ఇంటికి రాలేదు. వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, మరో విద్యార్థి హిజామ్ లువాంబి(17) స్నేహితురాలితో కలిసి నీట్ తరగతికి వెళ్లినట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరగా క్వాట్కా సమీపంలో హిజామ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని బాధితురాలి తండ్రి చెప్పగా, లామడాన్ వద్ద ఆమె స్నేహితురాలి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. కాగా ఇంఫాల్‌లోని దాదాపు 44 అనాథ శవాలకు ఆగస్టు 3న సామూహిక అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Also Read: Pushpa 2 Release Date: రికార్డులే లక్ష్యంగా బన్నీ బిగ్ ప్లాన్, పుష్ప2 రిలీజ్ డేట్ ఇదే!