Site icon HashtagU Telugu

Shikhar Dhawan: గ‌ర్ల్ ఫ్రెండ్‌తో టీమిండియా మాజీ స్టార్ క్రికెట‌ర్‌.. ఫొటోలు వైర‌ల్‌!

Shikhar Dhawan

Shikhar Dhawan

Shikhar Dhawan: భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ప్రస్తుతం తన కొత్త గ‌ర్ల‌ఫ్రెండ్‌తో నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ధావన్ దాదాపుగా త‌న‌తో డేటింగ్ చేస్తున్న‌ట్లు ధృవీకరించాడు. వీరిద్ద‌రూ ఇటీవ‌ల‌ చాలా సార్లు మీడియా కంటికి చిక్కారు. తాజాగా ధావన్, సోఫీతో కలిసి ముంబైలోని శ్రీ బాగేశ్వర్ బాలాజీ సనాతన్ మఠానికి చేరుకుని బాలాజీ సర్కార్ ఆశీర్వాదం తీసుకున్నారు. ధీరేంద్ర శాస్త్రి మాజీ క్రికెటర్‌ను వేదికపైకి ఆహ్వానించి క్రికెట్‌లో అతని సహకారం, ఇప్పుడు అవసరమైన పిల్లలకు సహాయం చేస్తున్నందుకు అతనిని ప్రశంసించాడు.

శిఖర్ ధావన్‌తో పాటు అతని గ‌ర్ల‌ఫ్రెండ్‌ సోఫీ షైన్ కూడా బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి నుండి ఆశీర్వాదం తీసుకున్నారు. ధీరేంద్ర శాస్త్రి శిఖర్ ధవన్‌కు కాషాయ రంగు పగడీ ధరించి స్వాగతించాడు. ఆ తర్వాత మాజీ క్రికెటర్ సోఫీతో కలిసి అక్కడ ఉన్న పారద శివలింగాన్ని కూడా పూజించాడు. శిఖర్ ధావ‌న్‌, ధీరేంద్ర శాస్త్రి కలిసి క్రికెట్ కూడా ఆడారు. మొదట ధవన్ బ్యాటింగ్ చేశాడు. ఒక బంతికే ధీరేంద్ర శాస్త్రి మాజీ క్రికెటర్‌ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ధీరేంద్ర శాస్త్రి బ్యాటింగ్ చేసి ధావన్ బౌలింగ్‌లో కొన్ని షాట్లు ఆడాడు. బౌల్డ్ అయిన తర్వాత పండిత్‌జీ ధావన్ దగ్గరకు వెళ్లి హాస్యాస్పదంగా ఇది నో బాల్ అని చెప్పాడు. అందరూ ఈ మ్యాచ్‌ను ఎంతగానో ఆనందించారు.

శిఖర్ ధావన్ గ‌ర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్ ఎవరు?

కొన్ని రోజుల క్రితం శిఖర్ ధావన్ ఒక ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు అతని స్నేహితురాలి గురించి అడిగితే అతను పేరు చెప్పనని, కానీ ఆ గదిలో కూర్చున్న అత్యంత అందమైన అమ్మాయి తన స్నేహితురాలు అని చెప్పాడు. సోఫీ షైన్ ఆ సమయంలో అక్కడే ఉంది. అంతకుముందు వీరిద్దరినీ చాలాసార్లు కలిసి చూశారు. ఇప్పుడు ధావన్ తన ఇంట్లో ఆమెతో కలిసి ఒక రీల్‌ను చేసి షేర్ చేశాడు.

Also Read: Mobile Phones: మొబైల్-ఫ్రీ జోన్‌గా ప్రైమరీ, లోయర్ సెకండరీ స్కూళ్లు.. ఎక్క‌డంటే?

శిఖర్ ధావన్ స్నేహితురాలు సోఫీ షైన్ ఐర్లాండ్‌కు చెందినవారు. ఆమె చాంపియన్స్ ట్రోఫీలో జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను చూడటానికి ధావన్‌తో వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో, ఈవెంట్‌లలో కూడా కలిసి కనిపించారు. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు.