Site icon HashtagU Telugu

Shashi Tharoor: వాహ్ సూపర్ సర్…బుక్ స్టోర్ కు ఎంపీ శశిథరూర్ అద్భుతపేరు..!!

Shashi Tharoor

Shashi Tharoor

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్…ఆయన ఇంగ్లీష్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎవరికీ నోరు తిరగని పదాలను పరిచయం చేస్తుంటారు శశిథరూర్. వీటికోసమే ఆయన్ను ట్విట్టర్ లో ఫాలో అయ్యేవాళ్లు వేలమంది ఉన్నారు. శశిథరూర్ ను ట్విట్టర్ లో ఫాలో అయ్యే అసోంకు చెందిన షాజహాన్ అనే వ్యక్తి తన ఫ్రెండ్ కొత్తగా ప్రారంభించే బుక్ స్టోర్ కు మంచి పేరు సూచించాలంటూ శశిథరూర్ ను కోరాడు.

ఏమని ట్వీట్ చేశాడంటే….డియర్ శశి థరూర్ సర్…నా మిత్రుడు ఎంఫిల్ పూర్తి అయిన తర్వాత మజూలీలో షాప్ తెరవాలని అనుకుంటున్నాడు. ఇందులో నెట్ కేఫ్, బుక్స్, స్టేషనరీ ఐటమ్స్ విక్రయాలకు పెడుతుంటాడు. తన షాపుకోసం ఇంగ్లీష్ లో ఒక వినూత్నమైన పేరు సూచించాలని అడుగుతున్నాడు. పేరుకు సంబంధించి అన్వేషణలో ఉన్నాడు అతను సాయం చేయగలరని ప్రార్థన అంటూ షాజహాన్ ట్వీట్ లో పేర్కొన్నాడు.

దీనిపై శశిథరూర్ స్పందించాడు. www:వరల్డ్ వైడ్ వర్డ్స్?అని పిలవడం ఎలా ఉంది…ఇది పుస్తకాలతోపాటుగా ఇంటర్నెట్ ను కూడా కవర్ చేస్తుందని శశిథరూర్ ట్వీట్ చేశారు. థరూర్ ఇచ్చిన సూచనను ఎంతో మంది అభినందిస్తున్నారు. వినూత్నమైన పేరును సూచించినందుకు షాజహాన్ కూడా ధన్యవాదాలు తెలియజేశాడు. షాపుకు అదే పేరు పెడతామని తెలిపారు.