Air Pollution : శీతాకాలం, పండుగలు సమీపిస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలోనే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో వాయు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని వైద్యారోగ్య శాఖలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ హెచ్చరికలను జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మార్నింగ్ వాక్, క్రీడలు లాంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపింది. వాయు కాలుష్యం తీవ్రతరమై అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తోందని వెల్లడించింది. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో క్రీడలు ఆడటం, ఉదయపు నడకకు వెళ్లడం వంటివి పరిమితం చేయాలన్నారు.
అలాగే, గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, ట్రాఫిక్ అధికారులు అలర్టుగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వాతావరణ మార్పు- మానవులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేలా జాతీయ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచనలు జారీ చేసింది. గాలి కాలుష్య సంబంధిత వ్యాధులను ట్రాక్ చేసే నిఘా వ్యవస్థలతో భాగస్వామ్యాన్ని పెంచాలని పేర్కొనింది. అలాగే, పంట వ్యర్థాలను కాల్చడం, పండగ సమయంలో బాణాసంచా వినియోగం, వ్యక్తిగత వాహనాలపై ప్రయాణం, డీజిల్ ఆధారిత జనరేటర్లపై ఆధారపడటం లాంటివి తగ్గించాలని చెప్పుకొచ్చింది. వ్యక్తులు ప్రభుత్వ యాప్ ద్వారా గాలి నాణ్యతను పర్యవేక్షించాలి అని సూచనలు చేసింది. ఇప్పటికే శ్వాసకోశ, హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు కాలుష్యం ఎక్కువగా ఉండే సమయాల్లో బయట తిరగడం తగ్గించాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read Also: YS Sharmila : వైస్సార్ శ్రేణులకు షర్మిల భారీ లేఖ