Vande Bharat Train Damaged: గేదెలను ఢీకొన్న ‘వందే భారత్’ రైలు ముందు భాగం డ్యామేజ్!

వందే భారత్.. దేశంలో హైస్పీడ్ ట్రైన్. ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత, ఈ ఉదయం గుజరాత్‌లో

  • Written By:
  • Updated On - October 6, 2022 / 04:34 PM IST

వందే భారత్.. దేశంలో హైస్పీడ్ ట్రైన్. ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత, ఈ ఉదయం గుజరాత్‌లో గేదెల మందను ఢీకొనడంతో వందే భారత్ రైలు ముందు భాగం దెబ్బతింది. రైలు ముంబై నుండి గాంధీనగర్‌కు వెళ్తుండగా, అహ్మదాబాద్‌కు ముందు బట్వా, మణినగర్ మధ్య ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. సంఘటన తర్వాత లోకోమోటివ్ ముందు భాగాన్ని ఒక కార్మికుడు తొలగిస్తున్నట్లు ఓ వీడియోలో చూడొచ్చు.

పట్టాలు క్లియర్ చేసిన తర్వాత రైలు ముందుకుసాగింది. గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెమీ-హైస్పీడ్ రైలును ప్రధాని మోదీ గత నెలలో జెండా ఊపి గాంధీనగర్ నుండి అహ్మదాబాద్‌లోని కలుపూర్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించిన విషయం తెలిసిందే.  ఈ ఘటన పట్ల ఇతర పార్టీల నాయకులు విమర్శలకు దిగారు. గుజరాత్ మోడల్ అంటే ఇలాగే ఉంటుందేమో అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.