Site icon HashtagU Telugu

Seema Haider : సీమా హైదర్ మాజీ భర్త ..రూ. 3 కోట్లకు నోటీసులు

Seema Haider's First Husban

Seema Haider's First Husban

 

Seema Haider: సీమా హైదర్(Seema Haiderకొన్ని నెలల క్రితం ఈ పేరు ఇండియా, పాకిస్థాన్ దేశాల్లో మార్మోగిపోయింది. పబ్‌జీ గేమ్ ద్వారా పరిచయమైన సచిన్ మీనా కోసం భర్త, పిల్లలను వదిలేసి మరీ ఇండియాకు వచ్చిన ఆమె వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రాస్ బోర్డర్ ప్రేమ వ్యవహారం ఇప్పుడు మరోమారు వార్తల్లోకి ఎక్కింది.

సీమా హైదర్ మాజీ భర్త గులామ్ హైదర్.. సీమ, ఆమె బర్త సచిన్ మీనాకు చెరో రూ. 3 కోట్లకు నోటీసులు పంపాడు. తన పిల్లలను వెనక్కి రప్పించుకునేందుకు భారత్‌లో ఓ న్యాయవాదిని మాట్లాడుకున్న గులామ్ ఆయన ద్వారా ఈ నోటీసులు పంపాడు. అంతేకాదు, సీమా సోదరుడిగా చెప్పుకుంటున్న డాక్టర్ ఏపీ సింగ్‌కు రూ. 5 కోట్లకు నోటీసులు పంపాడు.

We’re now on WhatsApp. Click to Join.

అడ్వకేట్ అలీ మోమిన్ ద్వారా పంపిన ఆ నోటీసుల్లో మీనా దంపతులు క్షమాపణ చెప్పడంతోపాటు పేర్కొన్న మొత్తాన్ని నెల రోజుల్లో డిపాజిట్ చేయాలని కోరారు. లేదంటే తామ తీసుకోబోయే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

read also : Saibaba : ప్రొఫెసర్‌ సాయిబాబా నిర్దోషి.. బాంబే హైకోర్టు తీర్పు

తన మాజీ భార్య వద్ద వున్న నలుగురు పిల్లల్ని తిరిగి తన వద్దకు చేర్చేందుకు అవసరమైన సాయం చేయాలంటూ పాకిస్థాన్‌కు చెందిన టాప్ లాయర్, మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీని గులామ్ ఆశ్రయించాడు. భారత్‌లో చట్టపరమైన ప్రొసీడింగ్స్ కోసం మొమిన్‌ను నియమించుకుని అందుకు అవసరమైన పవరాఫ్ అటార్నీని బదిలీ చేసినట్టు బర్నీ తెలిపారు.