Site icon HashtagU Telugu

Trading Accounts : డీమ్యాట్ అకౌంట్లలో ఏటీఎం కార్డులాంటి ఫీచర్.. వివరాలివీ

Trading Accounts

Trading Accounts

Trading Accounts :  స్టాక్‌మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూపోతోంది. కరోనా సంక్షోభ కాలం, వరుస లాక్‌డౌన్‌ల తర్వాత జనం డీమ్యాట్ ఖాతాలను(Trading Accounts) ఎక్కువగా ఓపెన్ చేసుకున్నారు. గత ఏడాది వ్యవధిలో కూడా డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య బాగానే పెరిగింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యాప్‌లు కొత్తకొత్తవి మార్కెట్లోకి వచ్చాయి. జనం చూపును బాగా ఆకర్షించాయి. దీనివల్ల కొత్త డీమ్యాట్ అకౌంట్స్ సంఖ్య శరవేగంగా పెరిగింది. ఇంటర్నెట్ వినియోగం పెరగడం కూడా ‘డీమ్యాట్’  విప్లవానికి దన్నుగా నిలిచింది. పెరుగుతూపోతున్న డీమ్యాట్ అకౌంట్లకు సైబర్ భద్రతను పెంచేందుకు.. కొత్త డీమ్యాట్ ఖాతాలను తెరుస్తున్న వారిలో ప్రభుత్వ నియంత్రణపై విశ్వాసాన్ని కలిగించేందుకు కొన్ని చర్యలను చేపడుతున్నారు.  ఈదిశగా తీసుకున్న ఒక కీలక నిర్ణయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

Also Read: INDIA Chairperson : ‘ఇండియా’ కూటమి ఛైర్ పర్సన్‌గా మల్లికార్జున ఖర్గే.. వివరాలివీ..

డెబిట్ కార్డుతో పాటు 5 రకాల బీమా

  • మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు చోరీకి గురైనా, లేదా డెబిట్ కార్డు ద్వారా ఎవరైనా దొంగ చెల్లింపులు చేసినా వాటికి ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంది. అయితే, అది బ్యాంకు నిబంధనలకు లోబడి ఉంటుంది.
  • డెబిట్ కార్డు వినియోగదారు ప్రమాదానికి గురై మరణం సంభవిస్తే వారిపై ఆధారపడిన వారు (కుటుంబ సభ్యులు) బీమా సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దిష్ట కాలపరిమితిలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాలపరిమితి వేర్వేరు బ్యాంకులకు వేర్వేరుగా ఉంటుంది.
  • విమాన ప్రయాణంలో ప్రమాదం జరిగినా, మరణం సంభవించినా ఈ బీమా వర్తిస్తుంది. అయితే, ఆ విమాన ప్రయాణ టికెట్ సదరు డెబిట్ కార్డుతో కొనుగోలు చేయాల్సి ఉంటుందనే నిబంధన చాలా బ్యాంకుల్లో ఉంది.
  • డెబిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసిన వస్తువులు పోయినా, చోరీకి గురైనా బీమా పొందవచ్చు.
  • ప్రయాణంలో మీ లగేజీ(వస్తువులు) పోయినా, లేదా వాటికి ఏదైనా కారణంతో అవి పాడైపోయినా, ధ్వంసమైనా బీమా పొందే అవకాశం ఉంది. ఇది బ్యాంకును బట్టి మారుతుంది. వీటన్నింటికీ బీమా సౌకర్యం ఉంటుంది. అయితే, అది బ్యాంకు నిబంధనలను అనుసరించి ఉంటుంది.బ్యాంకుకు అవసరమైన అన్ని ధ్రువపత్రాలు అందజేయాల్సి ఉంటుంది. బీమా కవరేజీ రూ.50 వేల నుంచి రెండు కోట్ల రూపాయల వరకూ పొందవచ్చు.