SEBI : రేపు పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్మన్ మాధబి

SEBI : రాజకీయ ప్రేరేపణలతోనే మాధభిని పిలిచారని బీజేపీ సీనియర్ సభ్యుడు ఆరోపణలు చేశారు. పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థల పనితీరు సమీక్షించేందుకు పార్లమెంట్ కమిటీకి అధికారాలుంటాయి.

Published By: HashtagU Telugu Desk
SEBI Chairman Madhabi will appear before the PAC tomorrow

SEBI Chairman Madhabi will appear before the PAC tomorrow

Parliamentary Public Accounts Committee : పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు రేపు సెబీ చైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తమ ఎదుట హాజరుకావాలని పార్లమెంట్ కమిటీ మాధబికి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో సెబీ పని తీరుపై సమీక్షించేందుకు పార్లమెంట్ కమిటీ రెడీ అయింది. ఈ నేపథ్యంలో గురువారం కాంగ్రెస్ ఎంపీ కేసీ. వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరగనున్న పార్లమెంట్ కమిటీ ముందు ఆమె హాజరుకానున్నారు. అయితే ఈ చర్యలను బీజేపీ తప్పుపట్టింది. రాజకీయ ప్రేరేపణలతోనే మాధభిని పిలిచారని బీజేపీ సీనియర్ సభ్యుడు ఆరోపణలు చేశారు. పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థల పనితీరు సమీక్షించేందుకు పార్లమెంట్ కమిటీకి అధికారాలుంటాయి. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు హాజరుకావాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే కేంద్రం నిర్వహించిన దర్యాప్తులో మాధబి లేదా ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా ఏమీ కనిపించలేదని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది. సెబీ చీఫ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, ఆమె నుంచి ఎలాంటి రాజీనామాలు ఆశించడం లేదని ఉన్నత వర్గాల పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. సెబీ చీఫ్‌ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారంటూ మాధబిపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల వ్యవహారంపై పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ ఇటీవల చేపట్టిన దర్యాప్తు ముగిసింది. అయితే మాధబి గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ తప్పు చేసినట్లుగా దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని సదరు వర్గాలు చెప్పినట్లు సమాచారం. అందువల్ల వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, మాధబి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అదానీ గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్‌ కంపెనీల్లో మాధబి పెట్టుబడులు పెట్టారని గతంలో హిండెన్‌బర్గ్‌ చేసిన పోస్ట్‌ సంచలనంగా మారింది. ఆ తర్వాత ఆమెపై మరిన్ని ఆరోపణలు వచ్చాయి. సెబీ ఛైర్‌పర్సన్‌ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారని, ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి వేతనం అందుకున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. అంతేగాక తన కన్సల్టెన్సీ సంస్థ అగోరా అడ్వైజరీ ప్రైవేటు లిమిటెడ్‌తో సెబీకి సంబంధాలున్నాయని ఆరోపణలు చేసింది. అయితే ఆరోపణలను మాధబి కొట్టిపారేశారు. తమ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఇలా చేశారని ఆమె ప్రకటనలో పేర్కొన్నారు.

Read Also: Cyclone Dana: వాయిదా పడిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష

  Last Updated: 23 Oct 2024, 05:30 PM IST