Electricity With Air : గాలి అణువుల నుంచి విద్యుత్.. ఇలా

Electricity With Air : సూర్యరష్మి నుంచి సోలార్ పవర్ .. మనకు తెలుసు !! నీటి నుంచి హైడ్రో పవర్ .. మనకు తెలుసు !! బొగ్గు నుంచి థర్మల్ పవర్.. మనకు తెలుసు !!యురేనియం నుంచి న్యూక్లియర్ పవర్ .. మనకు తెలుసు !! గాలి మరల నుంచి విండ్ పవర్..  మనకు తెలుసు !!

  • Written By:
  • Publish Date - May 30, 2023 / 01:05 PM IST

Electricity With Air : సూర్యరష్మి నుంచి సోలార్ పవర్ .. మనకు తెలుసు !!

నీటి నుంచి హైడ్రో పవర్ .. మనకు తెలుసు !!

బొగ్గు నుంచి థర్మల్ పవర్.. మనకు తెలుసు !!

యురేనియం నుంచి న్యూక్లియర్ పవర్ .. మనకు తెలుసు !!

గాలి మరల నుంచి విండ్ పవర్..  మనకు తెలుసు !!

సోలార్ పవర్ ఉత్పత్తి  రాత్రి పూట  సాధ్యం కాదు.. నీటి వనరులు అయిపోతే హైడ్రో పవర్ ఉత్పత్తి  సాధ్యం కాదు..  బొగ్గు నిల్వలు అయిపోతే థర్మల్ పవర్ ఉత్పత్తి  సాధ్యం కాదు..యురేనియం నిల్వలు అయిపోతే న్యూక్లియర్ పవర్ ఉత్పత్తి  సాధ్యం కాదు..  గాలి మరల ఏర్పాటుతో పవర్ ఉత్పత్తి అన్నిచోట్లా  సాధ్యపడదు.  ఇటువంటి తరుణంలో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచు సెట్స్ యాం హెర్స్ట్ (UMass Amherst)  చెందిన ఇంజనీరింగ్‌ కాలేజ్ లో ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ సరికొత్త విద్యుత్ ఉత్పత్తి మార్గాన్ని(Electricity With Air) కనుగొన్నారు. నేరుగా పలుచటి గాలి అణువుల నుంచి కూడా విద్యుత్ ను ఉత్పత్తి చేశారు. ” గాలి అనేది నీటి బిందువుల సమూహం. ఈ బిందువులలో ప్రతి ఒక్కటి ఛార్జ్‌ని కలిగి ఉంటుంది. వీటిలో విద్యుత్ శక్తి, మేఘ శక్తి సైతం దాగి ఉంటుంది. వాటి చుట్టూ తగిన పరిస్థితులు ఉన్నప్పుడు క్లౌడ్ కరెంట్ ను మనం ఉత్పత్తి చేయొచ్చు” అని UMass Amherst శాస్త్రవేత్తలు చెప్పారు.

Also read  : Headphones Effects: బీ అలర్ట్.. హెడ్ ఫోన్ వాడకంతో బ్యాక్టీరియా

కృత్రిమ మేఘం..  ప్రోటీన్ నానో వైర్లు

తాము ప్రయోగంలో భాగంగా చాలా గాలి బిందువులను కలిపి ఒక కృత్రిమ మేఘాన్ని సృష్టించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలక్ట్రోడ్ లను విడుదల చేసే సామర్ధ్యం కలిగిన జియో బ్యాక్టర్ సల్ఫర్ రిడ్యుసెన్స్ అనే బ్యాక్టీరియాలతో సహజ సిద్ధ వాతావరణంలో ప్రత్యేకంగా తయారు చేయించిన ప్రోటీన్ నానో  వైర్లను తయారు చేయించామని చెప్పారు. వీటి వ్యాసం 100 నానోమీటర్ల కంటే తక్కువ ఉంటుందన్నారు.  ప్రోటీన్ నానో  వైర్లను..  కృత్రిమ మేఘంతో చర్య జరిపించినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అయిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గాలిలోని తేమ నుంచి నిరంతరం విద్యుత్‌ను ఉత్పత్తి  చేయొచ్చని ఈ ప్రయోగం నిరూపించిందని తెలిపారు. “జెనరిక్ ఎయిర్-జీన్ ఎఫెక్ట్” అనే సూత్రంపై ఆధారపడి  ఈ వ్యవస్థ పనిచేస్తుందని వివరించారు.