Schengen Visa:షేంజెన్ వీసా అంటే ఏమిటి? దాని గురించి సమగ్ర సమాచారం!!

షేంజెన్ వీసా అంటేనే వెరీ వెరీ స్పెషల్. దీన్నే యూరోపియన్ వీసా అని కూడా పిలుస్తారు.

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 07:00 PM IST

షేంజెన్ వీసా అంటేనే వెరీ వెరీ స్పెషల్. దీన్నే యూరోపియన్ వీసా అని కూడా పిలుస్తారు. ఇదొక షార్ట్ టర్మ్ వీసా. దీన్ని వాడుకొని యూరోపియన్ యూనియన్ పాస్ పోర్ట్ ఫ్రీ జోన్ లోని ఏ దేశంలోనైనా పర్యటించవచ్చు. ఒకే పాస్ పోర్ట్ తో ఒకటికి మించి యూరోపియన్ యూనియన్ దేశాల్లో పర్యటించేందుకు షేంజెన్
వీసా ఉపయోగపడుతుంది. షేంజెన్ వీసా పరిధిలో 26 యూరోపియన్ యూనియన్ దేశాలు ఉన్నాయి. షేంజెన్ వీసాను వాడుకొని 26 ఈయూ దేశాల్లో 90 రోజుల పాటు టూర్ చేయొచ్చు. వ్యాపార కార్యకలాపాలను చక్కబెట్టుకోవచ్చు. అయితే షేంజెన్ వీసా పొందడం కొంత క్లిష్టమైన ప్రక్రియే.

షేంజెన్ వీసా అర్హతలు..

* మీ పాస్ పోర్ట్ కు 10 ఏళ్ల సీనియారిటీ ఉండాలి. మీరు ఈయూ బయలుదేరే ముందు మీ పాస్ పోర్ట్ కు కనీసం మరో 3 నెలల ఎక్స్ పరీ గడువు మిగిలి ఉండాలి.

* మీ బ్యాంక్ అకౌంట్లో తగినన్ని ఫండ్స్ ఉన్నట్టు ప్రూఫ్స్ చూపించాలి.

* ఈయూ పరిధిలోని ఏ దేశంలో ఎక్కడ ఉంటారనేది అడ్రస్ ఇవ్వాలి. ఎంత కాలం పాటు అక్కడ ఉంటారనేది కూడా వెల్లడించాలి.

* ఎయిర్ లైన్ టికెట్ వివరాలను కూడా అందించాలి.

* ఎందుకు ఈయూ దేశాలకు వెళ్తున్నారో చెప్పాలి.

* వీసా గడువు ముగిసేలోగా ఏయే ఈయూ దేశాలకు వెళ్తారో తెలియజేయాలి.

* ఎప్పుడు మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు అనేది కూడా వెల్లడించాలి.

* ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. దీని కవరేజ్ పరిధి కనీసం 30వేల యూరోలు ఉండాలి.

షేంజెన్ వీసా అప్లికేషన్ , ఫీజు మినహాయింపు

* 13 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్ళు వీసా అప్లికేషను ఫీజుగా EUR 60 (4,931.76 రూపాయలు) చెల్లించాలి.

* 6 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలు వీసా అప్లికేషను ఫీజుగా EUR 35 (2,876.57 రూపాయలు) చెల్లించాలి.

* 5 ఏళ్లలోపు పిల్లలకు వీసా అప్లికేషను ఫీజు అక్కర్లేదు.

* విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పరిశోధకులు, స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలకు వీసా ఫీజులో మినహాయింపు ఉంటుంది. అయితే వాళ్ళ వయసు 25 ఏళ్లకు మించి ఉండాలి.