EVM : వీవీ ప్యాట్‌పై మధ్యాహ్నం 2 గంటల్లోపు వివరణ ఇవ్వండి: ఈసీకి సుప్రీంకోర్టు సూచన

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 01:01 PM IST

EVM: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరుపై సుప్రీంకోర్టు(Supreme Court) బుధవారం భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి కొన్ని ప్రశ్నలను సంధించింది. వాటికి సమాధానం ఇవ్వడానికి మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ అధికారిని కోర్టుకు హాజరై తమ ప్రశ్నలకు బదులివ్వాలని సూచించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) పేపర్ స్లిప్‌లతో ఈవీఎంలలో 100 శాతం ఓట్ల లెక్కింపును క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశకు ఒక రోజు ముందు, ఏప్రిల్ 18న ఈ అంశంపై తన తీర్పును రిజర్వ్ చేసింది.

ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల వ్యవస్థపై ఓటర్ల నమ్మకం, సంతృప్తికి ఎంతో ప్రాధాన్యం ఉందని తెలిపింది. అయితే అదే సమయంలో ఈవీఎంల సమర్థతను అనుమానించొద్దని, ఎన్నికల సంఘం మంచి పని చేసినప్పుడు మెచ్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది.

Read Also:Weight Loss: ల‌వంగాలు కూడా బ‌రువును త‌గ్గిస్తాయా..? ఎలాగో తెలుసా..?

పిటిషనర్లలో ఒకటైన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఎన్నికల సంఘం 2017లో వీవీ ప్యాట్ ల యంత్రాలకు చేసిన మార్పులను ఉపసంహరించేలా ఆదేశించాలని కోరింది. వీవీ ప్యాట్ యంత్రాల్లోని పారదర్శక గాజుఫలకం స్థానంలో కాంతి నిరోధక గాజుఫలకాన్ని ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టింది. దీనివల్ల ఓటరు కేవలం 7 సెకన్లపాటు వెలిగే లైటు వెలుతురులోనే వీవీ ప్యాట్ స్లిప్ ను చూడగలరని పేర్కొంది. అందువల్ల ఎన్నికల సంఘం తిరిగి బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది.

దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈవీఎంల పనితీరును అర్థం చేసుకొనేందుకు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ కుమార్ తో సుమారు గంటపాటు చర్చించింది. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది మణీసిందర్ సింగ్ పిటిషనర్ల వాదనను తోసిపుచ్చారు. ఈవీఎంలు స్వతంత్రంగా పనిచేసే యంత్రాలని చెప్పారు. అయితే వాటిలో మానవ పొరపాటుకు అవకాశాన్ని తోసిపుచ్చలేమన్నారు.

Read Also:Free Bus : సీటు కోసం బస్సులో కొట్టుకున్న మగవారు

అంతకుముందు ఈ నెల 16న జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పిటిషనర్ల తీరుపై మండిపడింది. ఈవీఎంలపై విమర్శలు, బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరపాలన్న డిమాండ్ ను తప్పుబట్టింది. దేశంలో ఎన్నికల ప్రక్రియను అతిభారీ కసరత్తుగా అభివర్ణించింది. ఈ వ్యవస్థను కిందకు పడేసే ప్రయత్నాలు చేయకూడదని సూచించింది.

కాగా, వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్) అనేది ఒక స్వతంత్ర ఓటు ధ్రువీకరణ వ్యవస్థ. ఇది ఓటర్లు తమ ఓట్లు సరిగ్గా పోలయ్యాయో లేదో చూసేందుకు వీలు కల్పిస్తుంది.

Read Also:DC vs GT: నేడు ఢిల్లీ వ‌ర్సెస్ గుజ‌రాత్.. ఈ మ్యాచ్‌లో కూడా పరుగుల వరద ఖాయమేనా..?