Site icon HashtagU Telugu

Telangana Assembly : ఎస్సీ వర్గీకరణ బిల్లుపై నేడు అసెంబ్లీలో చర్చ

SC classification bill to be discussed in Assembly today

SC classification bill to be discussed in Assembly today

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు(మంగళవారం) ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరగనున్నది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే నేడు ఆరు ప్రభుత్వ బిల్లులు(ఎస్సీ వర్గీకరణతో పాటు మరో ఐదు బిల్లులు) ప్రవేశపెట్టనున్నారు. గత సంవత్సరం సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమం కావడంతో ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లులను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.

Read Also: యాపిల్ కీల‌క నిర్ణ‌యం.. ఈ రెండు మోడ‌ల్స్‌కి గుడ్ బై చెప్ప‌నున్న కంపెనీ

ఇక, సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వం ఐదు బిల్లులు ప్రవేశపెట్టగా మూడు బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోందించింది. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్‌ బిల్లు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ బిల్లు, తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదిస్తూ చేసిన సవరణ బిల్లు ఉన్నాయి. ఇక దేవాదాయ చట్ట సవరణ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఉండగా సభవాయిదా పడటంతో నేడు సభ ముందుకు రానున్నాయి.

మరోవైపు ఈరోజు సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా 15శాతం రిజర్వేషన్‌ అమలవుతున్నది. ఆ కోటాలో మాలలే ఎకువగా లబ్ధిపొందుతున్నారనే చర్చ 1970 దశకంలోనే మొదలైంది. అది క్రమేణా ఊపందుకున్నది. వాస్తవంగా జనాభాపరంగా మాలలకన్నా మాదిగల సంఖ్య ఎకువైయినప్పటికీ, విద్యా, ఉద్యోగావకాశాల్లో మాదిగలు చాలా తకువ స్థాయిలో ఉన్నారనేది వర్గీకరణ ఉద్యమానికి మూలం. తమకు అన్యాయం జరుగుతున్నదని మాదిగల పోరాటంతో ఎట్టకేలకే ఈ అంశంపై 1995లో ప్రభుత్వం జస్టిస్‌ రామచంద్రరాజు కమిషన్‌ను నియమించింది. మాదిగల వాదన నిజమేనని సమర్థిస్తూ ఆ కమిషన్‌ 1996లో తన నివేదికను సమర్పించగా, దాని ఆధారంగా 1997 జూన్‌లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 15 శాతం ఎస్సీ కోటాను ఏ, బీ, సీ, డీగా వర్గీకరిస్తూ జీవో విడుదల చేసింది.

Read Also: Sand Supply : ఇంటికే ఇసుక పంపిస్తున్న తెలంగాణ సర్కార్