Site icon HashtagU Telugu

RuPay Credit Card-UPI : రూపే క్రెడిట్ కార్డ్స్ తో ఇక యూపీఐ పేమెంట్స్.. ఆ రెండు బ్యాంకుల గ్రీన్ సిగ్నల్

Credit Cards

Credit Cards

RuPay Credit Card-UPI : SBI, ICICI బ్యాంక్ రూపే కార్డ్ హోల్డర్లు కూడా ఇప్పుడు తమ క్రెడిట్ కార్డ్‌లను BHIM యూపీఐతో లింక్ చేసుకోవచ్చు. UPI QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఈ కస్టమర్లు తమ క్రెడిట్ కార్డ్‌ని BHIM UPI యాప్ (BHIM)కి లింక్ చేయడం ద్వారా  ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. కస్టమర్‌లు UPI QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ చేయొచ్చు. BHIM యాప్ లో 11 బ్యాంకులకు చెందిన రూపే క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేసే వెసులుబాటు ఉంది. ఇప్పుడు బ్యాంకు అకౌంట్స్ నుంచి యూపీఐ  పేమెంట్స్ చేస్తున్నట్టే.. ఇకపై SBI, ICICI బ్యాంక్ కస్టమర్లు తమ రూపే క్రెడిట్ కార్డ్స్ తో కూడా  అదేవిధంగా యూపీఐ  పేమెంట్స్ చేయొచ్చు.  UPI సదుపాయంపై క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని రూపే 2022లో  ప్రవేశపెట్టింది. RuPay క్రెడిట్ కార్డ్‌లను Google Pay, Paytm, PhonePe, PayZapp, Freecharge వంటి ప్రసిద్ధ UPI యాప్‌లలో కూడా వాడొచ్చు.

Also read : Ram Charan’s Daughter: క్లీంకార కోసం స్పెషల్ రూమ్, వీడియో షేర్ చేసిన ఉపాసన

BHIM యాప్‌తో రూపే క్రెడిట్ కార్డ్‌ లింక్ ఇలా..