Stop Phone Ads : ఒక్క సెట్టింగ్.. ఫోన్‌లో యాడ్స్ కు గుడ్ బై

మీ స్మార్ట్  ఫోన్‌ లో యాప్స్ , వెబ్ సైట్స్ ఓపెన్ చేయగానే.. యాడ్స్ (అడ్వర్టైజ్మెంట్స్) ముంచెత్తుతున్నాయా ? వాటిని చూసి తికమక పడుతున్నారా ? వాటికి మీరు పర్మినెంట్ గా గుడ్ బై (Stop Phone Ads) చేప్పే ఒక జబర్దస్త్  సెట్టింగ్‌ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం..    

  • Written By:
  • Updated On - May 27, 2023 / 01:22 PM IST

మీ స్మార్ట్  ఫోన్‌ లో యాప్స్ , వెబ్ సైట్స్ ఓపెన్ చేయగానే.. యాడ్స్ (అడ్వర్టైజ్మెంట్స్) ముంచెత్తుతున్నాయా ? 

వాటిని చూసి తికమక పడుతున్నారా ?

వాటికి మీరు పర్మినెంట్ గా గుడ్ బై (Stop Phone Ads) చేప్పే ఒక జబర్దస్త్  సెట్టింగ్‌ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం..    

జస్ట్ ఆ ఒక్క సెట్టింగ్ ను ఆన్ చేయండి.. యాడ్స్ ను చూడలేక మీరు పడుతున్న కష్టాలు తీరిపోతాయి. 

యాడ్స్ ను ఆపేసే అడ్డుగోడను క్రియేట్ చేసే(Stop Phone Ads) ఆ సెట్టింగ్ ను చేయాలంటే మీరు కొన్ని స్టెప్స్ ను ఫాలో కావాలి. 

ఇవి చేస్తే మీకు ఇక  పాప్ అప్ యాడ్స్, ఏదైనా వెబ్ సైట్  చూసేటప్పుడు లేదా తెరిచేటప్పుడు యాడ్స్ రానే రావు. 

ఫోన్‌లో యాడ్స్ ను బ్లాక్ చేసే స్టెప్స్ ఇవీ..

→ ముందుగా మీ ఫోన్‌లోని “సెట్టింగ్స్ “లోకి వెళ్లండి.

→ ఇప్పుడు మీ జీ మెయిల్ అకౌంట్ ద్వారా దానికి యాక్సెస్ కండి.

→  సెట్టింగ్స్ లోని యాడ్స్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.

→ యాడ్  సెట్టింగ్స్ పేజీలో.. మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో మొదటిది  “పర్సనలైజ్డ్ యాడ్స్”, రెండోది “ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్” .

→ వీటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకొని యాక్టియేట్ చేయండి.

→ ఈ స్టెప్ ను ఫాలో అయ్యే  దశలో కొన్ని ఫోన్‌లలో ” రీసెట్ అడ్వర్టైజింగ్ ID ” లేదా “రీసెట్ యాడ్ ID” అనే ఆప్షన్ కనిపిస్తుంది.

→ ” రీసెట్ అడ్వర్టైజింగ్ ID ” లేదా “రీసెట్ యాడ్ ID” ఆప్షన్లలో ఏదో ఒక దాన్ని ఎంచుకోండి. మీ ఫోన్ యొక్క ప్రకటనల IDని రీసెట్ చేయండి.

→ అడ్వర్టైజింగ్ IDని రీసెట్ చేసిన తర్వాత.. మీ ఫోన్‌ని రీస్టార్ట్ చేయండి.

Also read : OTT Anti-Tobacco Warning: ఇకపై OTTలో ఆ యాడ్స్ తప్పనిసరి

ఇలా కూడా యాడ్స్ బ్లాక్ చేయొచ్చు  

మీ Android ఫోన్‌లో సెట్టింగ్‌లలోకి వెళ్లి ప్రైవేట్ DNS కోసం సెర్చ్ చేయండి.

ఇప్పుడు ఆ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

→  ఆ ఆప్షన్ లో ప్రైవేట్ DNS అనే దానిపై  మాత్రమే క్లిక్ చేయాలి.

ఇక్కడ మీరు మీ DNS  ప్రొవైడర్  హోస్ట్ పేరును రాయాల్సి ఉంటుంది.

దీని తర్వాత మీరు dns.adguard.com పై క్లిక్ చేయాలి.

→ అనంతరం దానిని ఫోన్ లో సేవ్ చేయాలి.

మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మాత్రమే ఈ ఫీచర్‌ను పొందుతారని గుర్తుంచుకోండి.