Satellites Collision : శాటిలైట్స్ కు వడదెబ్బ.. ఒకదాన్నొకటి ఢీకొనే ముప్పు!

Satellites Collision : భూమి చుట్టూ ఎన్ని ఉపగ్రహాలు (శాటిలైట్స్) తిరుగుతున్నాయో తెలుసా ? దాదాపు 6,800 శాటిలైట్స్  భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి.. అయితే వాటిలో 3,572 శాటిలైట్స్ మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి.. మిగితా వాటి ఎక్స్ పరీ డేట్ అయిపోయింది. ఇదంతా పాత ముచ్చటే.. ఈ ఉపగ్రహాలకు మన ఎండల వడదెబ్బ తాకబోతోంది అన్నది కొత్త ముచ్చట.

Published By: HashtagU Telugu Desk
Satellites Collision

Satellites Collision

Satellites Collision : భూమి చుట్టూ ఎన్ని ఉపగ్రహాలు (శాటిలైట్స్) తిరుగుతున్నాయో తెలుసా ?

దాదాపు 6,800 శాటిలైట్స్  భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి.. 

అయితే వాటిలో 3,572 శాటిలైట్స్ మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి.. మిగితా వాటి ఎక్స్ పరీ డేట్ అయిపోయింది.   

ఇదంతా పాత ముచ్చటే.. ఈ ఉపగ్రహాలకు మన ఎండల వడదెబ్బ తాకబోతోంది అన్నది కొత్త ముచ్చట.

ఎండలు ఎలా మండిపోతున్నాయో వేరేగా చెప్పనక్కర లేదు.. ఈ ఎండలకు భూమి వాతావరణం వేడెక్కుతోంది. ప్రతి ఏడాది ఎండాకాలంలో సూర్యుడిలో ఎక్కువ సంఖ్యలో  సౌర తుఫానులు సంభవిస్తాయి. సౌర తుఫానుల నుంచి వెలువడే అత్యంత వేడి గాలులు వచ్చి మన భూమి చుట్టూ ఉండే ఎగువభాగం పొర అయిన మాగ్నెటో స్పియర్ ను తాకుతాయి. మాగ్నెటో స్పియర్ ఒక అడ్డుగోడలా నిలబడి సౌర తుఫానులు మన భూమి వైపుగా రాకుండా నిలువరిస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే కిరణాల్లోని ప్రమాదకర రేడియషన్ కిరణాలు భూమి దాకా రాకుండా రక్షణ కల్పిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చాలా దేశాలు టెలికాం, రక్షణ, నిఘా, పౌర, నావిగేషన్, బ్రాడ్ కాస్ట్  అవసరాల కోసం ప్రయోగించే శాటిలైట్లు కూడా  మాగ్నెటో స్పియర్ వాతావరణంలోనే తిరుగుతుంటాయి. అంటే సౌర తుఫానుల ఎఫెక్ట్ వీటిపై పడే అవకాశాలు కొంత ఉంటాయి.

Also read : Android Phone Connectivity: ఆండ్రాయిడ్‌ ఫోన్స్ ఇక శాటిలైట్ తో కనెక్ట్.. “14” ఆపరేటింగ్ సిస్టమ్ సంచలనం!!

భూమికి 2000 కిలోమీటర్లలోపు కక్ష్యలో తిరుగుతున్న శాటిలైట్లను లోయర్ ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ అంటారు. వీటిపై సమ్మర్ లో సౌర తుఫానుల ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్త మార్టిన్ మ్లిన్‌జాక్ విశ్లేషించారు. సూర్యునిలో సంభవించే సౌర తుఫానుల వల్ల రిలీజ్ అయ్యే ప్లాస్మా, మాగ్నెటో స్పియర్ లో సంభవించే అయస్కాంత క్షేత్రాల భారీ పేలుళ్ల ఎఫెక్ట్ మన భూమి నుంచి పంపిన  శాటిలైట్స్ పై  పడే ముప్పు ఉందన్నారు. ఫలితంగా మాగ్నెటో స్పియర్ లోని శాటిలైట్స్ కు  ఎలక్ట్రికల్, మాగ్నెటికల్ అవరోధాలు ఎదురై ఒకదానికి ఇంకొకటి దగ్గరగా వెళ్లి ఢీకొనే (Satellites Collision) గండం ఉందని మార్టిన్ మ్లిన్‌జాక్ అభిప్రాయపడ్డారు.

  Last Updated: 06 Jun 2023, 02:37 PM IST