సాధారణంగా సీనియర్ సిటీజన్స్ ఏం చేస్తుంటారు. ఇంట్లో నచ్చిన పుస్తకాలు చదవుకుంటూనో, ఏ ఆధ్యాత్మిక సేవలోనో గడుపుతుంటారు. కానీ కొందరు మాత్రమే తమకు నచ్చిన పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అందుకోసం ఏంతైనా సాహసం చేస్తుంటారు. అలాంటివాళ్లలో ఒకరు ఈ నాగరత్నమ్మ. బెంగళూరుకు చెందిన నాగరత్నమ్మ వయసు 62. అయితేనేం ఈ వయసులోను యాక్టివ్ గా ఉంటూ తన పనులు తాను చేసుకుంటూ ఉంటారు. ఈ పెద్దావిడ ఎవరూ చేయని సాహసం చేసి వార్తల్లోకి ఎక్కింది. పశ్చిమ కనుమలలోని అత్యంత కష్టతరమైన శిఖరాలలో ఒకదానిని అధిరోహించింది. యువకులు, పిల్లలకు సైతం సాధ్యంకాని ఈ ఘనతను అందుకుందీమె. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఉన్న అగస్త్య కూడం అని పిలువబడే కొండపైకి నాగరత్నమ్మ అధిరోహించింది. ఆమె తాడు సాయంతో పర్వతం ఎక్కినట్టు వీడియోలు చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
“సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఎత్తైన, కష్టతరమైన శిఖరాలలో ఒకటి. ఇది నాగరత్నమ్మ 16 ఫిబ్రవరి 2022న రోప్ క్లైంబింగ్ ద్వారా అధిరోహించింది. ఆమె తన కొడుకు, స్నేహితులతో కలిసి పాల్గొంది. పెళ్లయిన తర్వాత గత 40 ఏళ్లుగా కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉన్నానని చెప్పింది. ఇప్పుడు, ఆమె పిల్లలందరూ పెరిగి స్థిరపడ్డారు కాబట్టి.. ఆమె తన కలలను నెరవేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.