Site icon HashtagU Telugu

Sam Curran Doppelganger: సామ్‌ కర్రన్‌ లాంటి వ్యక్తి.. ఎవ‌రీ ట్రెండింగ్ ప‌ర్స‌న్‌!

Sam Curran Doppelganger

Sam Curran Doppelganger

Sam Curran Doppelganger: ఐపీఎల్ 2025లో నిన్న రాత్రి లక్నో సూపర్ జెయింట్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓటమి చెందడంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్లేఆఫ్స్ రేస్ నుండి కూడా బయటకు వ‌చ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ, ఎల్‌ఎస్‌జీ స్పిన్ బౌలర్ దిగ్వేశ్ రాఠీ మధ్య గొడవ జరిగింది. ఒకవైపు ఈ ఇద్దరు ఆటగాళ్లు మైదానంలో గొడవ పడుతుండగా.. మరోవైపు స్టేడియంలో కూర్చున్న సామ్ కరన్‌ను పోలిన ఆస్ట్రేలియన్ యూట్యూబర్ జేక్‌ దిగ్వేశ్ రాఠీని ఎగతాళి చేశాడు.

దిగ్వేశ్ రాఠీని ఎగతాళి చేశాడు

నిజానికి ఆస్ట్రేలియన్ యూట్యూబర్ జేక్ జీకింగ్స్ రూపం ఇంగ్లండ్ క్రికెటర్ సామ్‌ కర్రన్‌ను (Sam Curran Doppelganger) చాలా వరకు పోలి ఉంటుంది. ఎల్‌ఎస్‌జీ వర్సెస్ సన్‌రైజర్స్ మ్యాచ్‌ను చూడటానికి జేక్ జీకింగ్స్ స్టేడియానికి వ‌చ్చాడు. అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీ ధరించాడు. అభిషేక్ శర్మ, దిగ్వేశ్ రాఠీ మధ్య గొడవ జరిగిన‌ తర్వాత కమిందు మెండిస్.. దిగ్వేశ్ బౌలింగ్‌లో కొన్ని పెద్ద షాట్‌లు ఆడాడు. ఇదంతా చూసిన స్టాండ్‌లో కూర్చున్న యూట్యూబర్ జేక్ జీకింగ్స్ నోట్‌బుక్ సెలబ్రేషన్ చేస్తూ దిగ్వేశ్ రాఠీని ఎగతాళి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

దిగ్వేశ్ రాఠీపై ఒక మ్యాచ్ నిషేధం

మ్యాచ్ సమయంలో అభిషేక్ శర్మతో గొడవ పడినందుకు బీసీసీఐ దిగ్వేశ్ రాఠీకి కఠిన శిక్ష విధించింది. బీసీసీఐ దిగ్వేశ్ రాఠీపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. దీని కారణంగా రాఠీ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జ‌రిగే మ్యాచ్‌ ఆడలేడు. అంతేకాకుండా దిగ్వేశ్‌పై మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. అభిషేక్ శర్మకు కూడా బీసీసీఐ ఐపీఎల్ రూల్స్‌ ఉల్లంఘన కింద మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది.

Also Read: Sam Curran Doppelganger: సామ్ కుర్రాన్ లాంటి వ్యక్తి.. ఎవ‌రీ ట్రెండింగ్ ప‌ర్స‌న్‌!

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. అభిషేక్ ఎల్‌ఎస్‌జీ బౌలర్లను బాగా ధీటుగా ఎదుర్కొని 20 బంతుల్లో 59 పరుగుల పరుగులు చేశాడు. తన ఈ ఇన్నింగ్స్‌లో అతను 6 సిక్సర్లు, 4 ఫోర్లు కొట్టాడు. దీని కారణంగా అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.