No Savings: ఈ అలవాట్లు ఉంటే.. మీ శాలరీ ఎంత ఉన్నా ఇట్టే ఆవిరైపోతుంది!!

అయితే మీరు కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. అలవాట్లు మార్చుకుంటే మీకు పొదుపు మిగులుతుంది. శాలరీ మీ ఖర్చులకు సరిపోతుంది.

  • Written By:
  • Publish Date - September 11, 2022 / 07:30 AM IST

మీకు భారీ జీతం ఉన్నా.. ఒక్క రూపాయి కూడా సేవింగ్స్ చేయలేకపోతున్నారా?

ఇలా ఎందుకు జరుగుతోందని ఆందోళన చెందుతున్నారా?

శాలరీ సరిపోక కొత్త అప్పులు చేయాల్సి వస్తోందా ?

అయితే మీరు కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. అలవాట్లు మార్చుకుంటే మీకు పొదుపు మిగులుతుంది. శాలరీ మీ ఖర్చులకు సరిపోతుంది.

ఖర్చుకు, వృథా ఖర్చుకు తేడా అనేది తెలియక ప్రవర్తించే వారు అలర్ట్ కావాలి. జీతం నుంచి జరుగుతున్న దాదాపు 10 నుంచి 20 శాతం వృథా ఖర్చును ఆపితే జీవితమే మారిపోతుంది. జీవితంలో నిలదొక్కుకుంటారు. ఆర్ధిక స్వావలంబన సాధిస్తారు. ఇందుకోసం కొన్ని దురలవాట్లను కూడా దూరం పెట్టాలి. అప్పుడే జీవితంలో అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉదాహరణకు ఒక వ్యక్తికి నెలకు 50వేల రూపాయల జీతం ఉంటే.. అందులో దాదాపు 5వేలు నుంచి 10వేలు వృథా ఖర్చులు అవుతుంటాయి. వీటిని ఆపితే ఆర్ధిక కష్టాలకు అడ్డుకట్ట పడుతుంది. ఇందుకోసం మీరు చేసే ఖర్చులను విభజించి చూసుకోవాలి. అవసరం, అత్యవసరం, అనవసరం అనే మూడు విభాగాలుగా ఖర్చులను విభజించుకోవాలి. తద్వారా మీ శాలరీలో చాలావరకు సేవింగ్స్ అవుతాయి.

* ఇంటి బయట తినడం : ఇంటి బయట తినాలంటే బాగా ఖర్చు అవుతుంది. ఈక్రమంలో మన పర్సు ఖాళీ అవుతుంది. జొమాటో, స్విగ్గీ వంటి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ఆర్డర్స్ ఇచ్చిన..అదనంగా ట్యాక్స్ పేమెంట్స్ చేయాల్సి వస్తుంది. డెలివరీ చార్జీలు కూడా ఎక్స్ ట్రా ఉంటాయి. బయట ఫుడ్ తినడానికి పెట్టే ఖర్చులో కేవలం నాలుగో వంతు ఖర్చుతో ఇంట్లో లేదా రూమ్ లో భోజనం వండుకోవచ్చు అని గుర్తుంచుకోవాలి. దీనివల్ల మనకు ఎంతో డబ్బు ఆదా అవుతుంది.

* బయట తిరగడం : ఎంతోమంది దేశ, విదేశీ టూర్లకు బోలెడంత డబ్బు ఖర్చు పెడుతుంటారు. ప్రతినెలా టూర్లకు వెళ్లే మహానుభావులు కూడా ఉంటారు. టూర్ అంటే మామూలు విషయమా? ప్రయాణ ఖర్చులు, భోజన ఖర్చులు, వసతి ఖర్చులు, షాపింగ్ ఖర్చులు , ఇతర ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ తడిసి మోపెడు అవుతాయి.కాబట్టి టూర్ కు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడం ..ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడం ఆపేయండి.

* అనవసర షాపింగ్ : అనవసర షాపింగ్స్ చేయొద్దు. అనవసర వస్తువులు అనవసర టైంలో కొనొద్దు. ఇలా చేస్తే అవసరమైన టైంలో అవసరమైన వస్తువులు కొనలేని పరిస్థితి ఎదురు అవుతుంది. అనవసర సమయంలో షాపింగ్ కు వెళ్లాలనే ఆలోచన కూడా రానివ్వొద్దు. తక్కువ ధరకు అమ్ముతున్నారనో.. డిస్కౌంట్ ఇస్తున్నారనో అనవసర వస్తువులు కొని స్టాక్ పెట్టుకోవద్దు.
దీనివల్ల మీ మనీ అనవసర చోట జామ్ అయిపోతుంది.

* మద్యం, సిగరెట్ : మద్యం అలవాటు మంచిది కాదు. దీనికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మద్యం తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. వాటికి చికిత్స చేయించు కునేందుకు మళ్ళీ అదనంగా డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. సిగరెట్ తాగినా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్, సైడ్ ఖర్చులు తడిసి మోపెడు అవుతాయి.