American Woman: లగ్జరీ లైఫ్ కు వదులుకొని, సన్యాసం తీసుకున్న అమెరికన్ మహిళ

ఐదు అంకెల జీతం.. లగ్జరీ లైఫ్ వదులుకొని ఇండియాలో సన్యాసం తీసుకుంది అమెరికన్ మహిళ.

Published By: HashtagU Telugu Desk
Sadvi

Sadvi

భారతీయ విలువలు, కట్టుబాట్లు, ఆధ్యాత్మిక జీవనానికి ఆకర్షితులైన ఓ అమెరికన్ మహిళా సన్యాసం తీసుకొని సాద్వీగా మారింది. ఆమె పేరు సాధ్వి భగవతి సరస్వతి. భారతదేశంలోని రిషికేశ్‌లో ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్న ఆమె అమెరికా నివాసి. ఆమె భారతదేశాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్న సమయంలో 1996లో కాలిఫోర్నియా స్టాండ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి చదువుతుంది. ఆమెకు ఆధ్యాత్మికతతో సంబంధం లేకపోయినా ఎప్పుడూ శాఖాహారం తినేది.

ఆమె స్నేహితుల కోసం ఎగతాళి చేసినా ఏమాత్రం పట్టించుకోలేదు.  ఆ తర్వాత ఆమెకు భారత్ పట్ల ఆసక్తి పెరిగింది. ‘లోన్లీ ప్లానెట్’ అనే ట్రావెల్ గైడ్‌బుక్‌ని కొనుగోలు చేసింది. అక్కడి నుంచి రిషికేశ్ గురించి తెలుసుకుని ట్రిప్ ప్లాన్ చేసింది. రిషికేశ్ చేరుకున్న తర్వాత, అక్కడ మతపరమైన ఆచారాలను చూసి మురిసిపోయింది. మంత్రోచ్ఛారణలు, గంగాస్నానం, గంటల శబ్దం ఆమెను మంత్రముగ్ధులను చేశాయి. క్రమంగా ఆమె రిషికేశ్‌లోని జీవనశైలికి అనుగుణంగా మారడం ప్రారంభించింది.

అదే సమయంలో ఆమె తన జీవితాన్ని ఆధ్యాత్మికతకు అంకితం చేయాలని కోరుకుంది. కానీ గురూజీ ఆమెను అమెరికాకు తిరిగి వెళ్లి తన విద్యను పూర్తి చేయమని కోరాడు. గురూజీ చెప్పిన్నట్టుగా ఉన్నత విద్యను అభ్యసించింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి గురూజీ మెప్పుతో సన్యాసం తీసుకుంది. ఆధ్యాత్మిక కు ఆకర్షితురాలైన ఆమె ‘హాలీవుడ్ టు హిమాలయాస్’ పుస్తకాన్ని కూడా రచించారు.

Also Read: Mega Celebrations: ఇట్స్ అఫీషియల్.. రేపే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం!

  Last Updated: 08 Jun 2023, 02:56 PM IST