Sachin Tendulkar: బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?!

బీసీసీఐ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తదుపరి బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్‌ పేరు వినిపించింది.

Published By: HashtagU Telugu Desk
Sachin Tendulkar

Sachin Tendulkar

Sachin Tendulkar: బీసీసీఐ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తదుపరి బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్‌ (Sachin Tendulkar) పేరు వినిపించింది. సచిన్ టెండూల్కర్ తదుపరి బీసీసీఐ అధ్యక్షుడిగా అవుతారని పుకార్లు వ్యాపించాయి. అయితే ఈ విషయాలపై సచిన్ స్పందించారు. బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా తాను ఉండబోనని స్పష్టం చేశారు. సచిన్ టీమ్ ఒక ప్రకటన విడుదల చేసి ఈ విషయాన్ని ధృవీకరించింది.

సచిన్ టెండూల్కర్ ప్రకటన విడుదల

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సచిన్ అవుతారన్న పుకార్లను ఆయన ఖండించారు. ఆయన టీమ్ విడుదల చేసిన ప్రకటనలో “సచిన్ టెండూల్కర్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవికి పరిశీలిస్తున్నారని లేదా నామినేట్ చేస్తున్నారని కొన్ని నివేదికలు, పుకార్లు మా దృష్టికి వచ్చాయి. ఇలాంటిదేమీ జరగలేదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము” అని పేర్కొన్నారు.

ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేయవద్దని సచిన్ టీమ్ అందరినీ కోరింది. నిరాధారమైన ఊహాగానాలకు ఎవరు శ్రద్ధ చూపవద్దని ఆ టీమ్ కోరింది. ఈ ప్రకటనను ఎస్‌ఆర్‌టి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేసింది. సచిన్ భారతదేశం కోసం 200 టెస్ట్ మ్యాచ్‌లు, 463 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడారు. 2013లో ఆయన చివరి మ్యాచ్ ఆడారు.

Also Read: Heavy Rain : చెరువులా మారిన హైదరాబాద్ -విజయవాడ హైవే

సెప్టెంబర్ 28న ఎన్నికలు

సెప్టెంబర్ 28న బీసీసీఐ అధ్యక్షుడికి ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులకు కూడా ఎన్నికలు జరుగుతాయి. సెప్టెంబర్ 12న రాష్ట్ర సంఘాలు తమ ప్రతినిధుల పేర్లను వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) కోసం సమర్పించడానికి చివరి తేదీగా నిర్ణయించారు. ఈ జాబితా ఆధారంగా కీలక పదవులకు ఎవరు పోటీదారులుగా ఉంటారో ఒక అంచనా వేయవచ్చు.

  Last Updated: 11 Sep 2025, 08:59 PM IST