Asteroid and Life: భూమిపై జీవం ఎలా పుట్టింది.. పరిశోధనలో బయటపడిన సంచలన విషయాలు?

భూమిపై జీవం ఎలా పుట్టింది అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ మెదులుతూ ఉంటుంది. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పటివరకు దొరకలేదు.

  • Written By:
  • Publish Date - June 14, 2022 / 08:00 AM IST

భూమిపై జీవం ఎలా పుట్టింది అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ మెదులుతూ ఉంటుంది. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పటివరకు దొరకలేదు.ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని కోసం శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు.అయితే తాజాగా జరిగిన పరిశోధనలో భాగంగా జీవం పుట్టుక ఎలా ఏర్పడింది అనే విషయం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. జపనీస్ స్పేస్ ప్రోబ్ ద్వారా సేకరించిన గ్రహశకలం ధూళి, శ‌క‌లాలలో ఉన్న‌ సేంద్రియ పదార్థాలు భూమి పై ఉన్నటువంటి జీవన్ లో కూడా ఉన్నాయని నిపుణులు వెల్లడించారు.

ర్యుగు’ అనే గ్ర‌హ‌శ‌క‌లం భూమి నుంచి సుమారు 300 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ గ్రహశకలం నుంచి 2020లో కొన్ని న‌మూనాలు సేకరించి పరిశోధనలు జరిపారు. ఈ గ్రహశకల నమూనాలలో 5.4 గ్రాముల (0.2 ఔన్సుల) చిన్న రాళ్లలో చిన్న భాగాలపై అధ్య‌య‌నం ప్రారంభించారు. వీటిలో జీవం పుట్టుకకు కారణమైన అమైనో ఆమ్లాలతో పాటు జీవం మూలాల‌కు సంబంధించిన ఇత‌ర క‌ర్బ‌న ప‌దార్థాలున్న‌ట్లు పశ్చిమ జపాన్‌లోని ఓకాయామా విశ్వవిద్యాలయం  పరిశోధకులు బయటపెట్టారు.

ఈ గ్రహశకలంలో భాగంగా అమైనో ఆమ్లాలతో కలిసి ఏర్పడే ప్రోటీన్ ఆవిష్క‌ర‌ణ చాలా ముఖ్య‌మైన‌ది. ఎందుకంటే ఉల్క‌ల‌లాగా రుగ్యు గ్ర‌హ‌శ‌క‌లం భూమిని ఢీకొట్ట‌లేదు. ఈ పరిశోధనలను బట్టి చూస్తుంటే జీవం మూలాలు అంత‌రిక్షంలో ఏర్ప‌డ్డాయ‌ని దీని వ‌ల్ల తెలుస్తోంది. భూమిపై జీవం మూలం అంతరిక్షం నుంచి ఏర్పడిందని పరిశోధనల సందర్భంగా నిపుణులు వెల్లడించారు.