Russia Ukraine War: ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి 100 రోజులు!

ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - June 4, 2022 / 01:18 PM IST

ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. పెద్ద దేశమైన రష్యా చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ అన్నివిధాల ప్రయత్నిస్తోంది. నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడుతోంది. యుద్ధం కారణంగా ధన, ప్రాణ నష్టం జరిగినా రెండు దేశాలు ఏమాత్రం తగ్గడం లేదు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఉక్రేనియన్ భూభాగంలో మాస్కో దళాలు 20 శాతం నియంత్రణలో ఉన్నాయి. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ.. రష్యా చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో రోజుకు వంద మంది సైనికులు చనిపోతున్నారని అన్నారు. రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ భూభాగంలో ఐదవ వంతును ఆక్రమించిందని కూడా చెప్పాడు. ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధానికి ముందు రష్యా, మాస్కో మద్దతు ఉన్న వేర్పాటువాదులు ఉక్రెయిన్‌లో 10 శాతం కంటే తక్కువగా ఉన్నారు.

మరోవైపు సెవెరోడోనెట్స్క్‌లో భారీ పోరాటాలు కొనసాగుతున్నాయని ఉక్రేనియన్ స్పష్టం చేసింది. లుహాన్స్క్ ప్రాంతీయ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అధిపతి సెర్గీ హైదాయ్ ఇటీవల మాట్లాడుతూ.. రష్యా చాలా వరకు నియంత్రణను పొందుతోందని, అయితే ఉక్రేనియన్ దళాలు ఇప్పటికీ ప్రతిఘటనను ప్రదర్శిస్తున్నాయని వెల్లడించారు.  ఖార్కివ్ ప్రాంతంలోని ఫ్రంట్‌లైన్‌ను సందర్శించిన సందర్భంగా  అధ్యక్షుడు జెలెన్స్కీ తన దేశ సైనికులు చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అన్నారు. తమ దేశాన్ని కాపాడుకునేంతవరకు పోరాడుతామని ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశాడు.