Russia : చైనాలో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌

  • Written By:
  • Publish Date - May 15, 2024 / 10:51 AM IST

Russia: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌(Vladimir Putin) ఐదవసారి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వత మొదటి సారి తన తొలి విదేశీ పర్యటనలో చైనాలో పర్యటించనున్నారు.మే 16 నుండి 17 వరకు చైనాలో పర్యటిస్తారని చైనా( China) విదేశాంగ ఇప్పటికే ప్రకటించింది. గడిచిన ఎనిమిది నెలల కాలంలో పుతిన్‌ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి.

We’re now on WhatsApp. Click to Join.

చైనా పర్యటనలో పుతిన్ ఆ దేశ జీ జిన్‌పింగ్‌(Xi Jinping)తో సమావేశం కానున్నారు. “సమగ్ర భాగస్వామ్యం మరియు వ్యూహాత్మక సహకారం యొక్క మొత్తం శ్రేణి సమస్యల గురించి వివరంగా చర్చిస్తారు. రష్యన్-చైనీస్ ఆచరణాత్మక సహకారాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కీలకమైన ప్రాంతాలను గుర్తిస్తారు. మరియు అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ మరియు ప్రాంతీయ సమస్యలపై వివరంగా అభిప్రాయాలను మార్పిడి చేసుకుంటారు.

Read Also: Ranbir Kapoor : రణ్‌బీర్, సాయి పల్లవి రామాయణం బడ్జెట్ తెలిస్తే షాక్ అవుతారు.. ఇండియాలోనే..!

చర్చల అనంతరం వారు ఉమ్మడి ప్రకటనపై సంతకం చేస్తారని క్రెమ్లిన్ తెలిపింది. రష్యా, చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లైన సందర్భంగా జిన్‌పింగ్‌ ఆహ్వానం మేరకు పుతిన్‌ చైనాను సందర్శిస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. కాగా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గతవారమే ఐరోపాలో అయిదు రోజుల పర్యటన ముగించుకొని వచ్చారు.

Read Also: RBI New Rule: ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం.. మీ బ్యాంక్ అకౌంట్‌లో మైన‌స్ బ్యాలెన్స్ ఉన్నాయా..?

కాగా, ఐరోపాలో రష్యాకు సన్నిహితమైన సెర్బియా, హంగరీలనూ జిన్‌సింగ్‌ సందర్శించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌తో జరిపిన చర్చల్లో రష్యాకు ఆయుధాలను కానీ, యుద్ధానికీ, పౌర ప్రయోజనాలకు రెండింటికీ ఉపకరించే సాధనాలను కానీ సరఫరా చేయబోమని జిన్‌పింగ్‌ హామీ ఇచ్చారు.