Russia expels six British diplomats: మాస్కోలోని ఆరుగురు బ్రిటన్ దౌత్యవేత్తలను గూఢచర్యం ఆరోపణలతో బహిష్కరించినట్లుగా రష్యా భద్రతాధికారులు తెలిపారు. అయితే ఆ ఆరుగురు దౌత్యవేత్తలు బ్రిటన్ రాయబార కార్యాలయంలోని రష్యాకు సంబంధించిన సైనిక, పాలనాపరమైన సమాచారాన్ని తమ శత్రు దేశాలకు చేరవేస్తున్నట్లుగా ఆధారాలు లభ్యమయ్యాయి. దీనివల్ల రష్యన్ ఫెడరేషన్ భద్రతకు ముప్పు పొంచి ఉన్నట్లుగా భావించి వెంటనే వారి అక్రిడిటేషన్లు రద్దు చేసినట్లు మాస్కో అధికారులు పేర్కొన్నారు.
ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫ్ రష్యా బ్రిటిష్ ఎంబసీ రాజకీయ విభాగానికి చెందిన ఆరుగురు సభ్యులు గూఢచర్యానికి పాల్పడినట్లుగా ఆధారాలు సమర్పించింది. అయితే ఇప్పటివరకు లండన్‌కు, రష్యాకు మధ్య ఉన్న స్నేహపూర్వక చర్యల కారణంగా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా దౌత్యవేత్తలను బహిష్కరించాం” అని రష్యన్ అధికారులు పేర్కొన్నారు. ఈవిషయంలో ఇతర బ్రిటన్ దౌత్యవేత్తల ప్రమేయం ఉందని తెలిస్తే వారిని కూడా బహిష్కరిస్తామని పేర్కొన్నారు.
Read Also: Mission Mausam: మిషన్ మౌసం అంటే ఏమిటి? ప్రకృతి వైపరీత్యాలను ఆపుతుందా..?
మాస్కోలోని బ్రిటీష్ రాయబార కార్యాలయం దౌత్య ఒప్పందాల గురించే కాక దేశానికి నష్టం కలిగించే గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పాటు దేశ ప్రజలకు హాని కలిగించాలనే ఉద్దేశపూర్వక చర్యలకు ఒడిగడుతున్నట్లుగా రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై మాస్కోలోని బ్రిటన్ రాయబార కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన లేదు. స్పందించలేదు.
కాగా, గూఢచర్యం ఆరోపణలతో రష్యా రాయబార కార్యాలయంలోని రక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే ఓ అధికారిని బ్రిటన్ ఇటీవల బహిష్కరించింది. తమ దేశంలో రష్యా నిఘా కార్యకలాపాలను ఈ అధికారి పర్యవేక్షిస్తున్నారని బ్రిటన్ హోంశాఖ కార్యాలయం తెలిపింది. ఈవిషయంలో రష్యా రాయబారికి కూడా సమన్లు పంపి.. ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.