Insurance : రూ.320కే రూ.5 లక్షల బీమా.. తపాలా శాఖ ఇన్సూరెన్స్ స్కీమ్స్

Insurance : భారత తపాలా శాఖ  ఇప్పుడు ఇన్సూరెన్స్ బిజినెస్‌పైనా ఫోకస్ చేస్తోంది.

  • Written By:
  • Publish Date - December 29, 2023 / 09:50 AM IST

Insurance : భారత తపాలా శాఖ  ఇప్పుడు ఇన్సూరెన్స్ బిజినెస్‌పైనా ఫోకస్ చేస్తోంది. ఈక్రమంలోనే చాలా చౌకైన పలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లను అందుబాటులోకి తెచ్చింది.  వీటి ద్వారా అతి తక్కువ వార్షిక ప్రీమియంతో ఎంతో సేఫ్టీని, ఇతర ప్రయోజనాలను మనం పొందొచ్చు. జీవితాన్ని సేఫ్‌గా ఫీల్ కావచ్చు. మన కుటుంబానికి మంచి భద్రతను, భరోసాను అందించవచ్చు. ఈ ప్రమాద బీమా పాలసీలను 18  నుంచి 65 ఏళ్లలోపు వారు తీసుకోవచ్చు.  సమీపంలోని తపాలా శాఖ కార్యాలయంలో సంప్రదిస్తే సరిపోతుంది. ఇంతకీ ఆ ప్రమాద బీమా పాలసీలు(Insurance) ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

ఏటా రూ.755 చెల్లిస్తే.. 

  • నివా బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో కలిసి తపాలాశాఖ అందిస్తున్న ఒక ప్రమాద బీమా పాలసీ కోసం ఏడాదికి రూ.755 కట్టాలి. ఈ వ్యవధిలో ప్రమాదంలో మృతిచెందితే నామినీకి రూ.15 లక్షలు వస్తాయి.
  • ఏదైనా ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యంతో పాటు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం ఏర్పడినా రూ. 15 లక్షల దాకా వస్తాయి.
  • ప్రమాదం జరిగిన తర్వాత వైద్య ఖర్చుల కోసం రూ. లక్ష అందిస్తారు. ఆస్పత్రిలో సాధారణ వైద్యం అందితే రోజుకు రూ.1000, ఐసీయూలో ఉంటే రూ.2 వేలు చొప్పున బీమా పాలసీ ద్వారా అందుతాయి.
  • ఒకవేళ చేయి, కాలు ఏదైనా విరిగిపోతే  రూ.25,000 ఇస్తారు.
  • పాలసీదారు చనిపోతే.. పిల్లల విద్యా ప్రయోజనాలకు రూ.లక్ష ఇస్తారు. పిల్లల పెళ్లికి కూడా రూ. లక్ష ఇస్తారు.

Also Read: Ayodhya Airport : అయోధ్య ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లకు కొత్త పేర్లు

ఏటా రూ.520 చెల్లిస్తే.. 

  • టాటా ఏఐజీతో కలిసి తపాలా శాఖ అందిస్తున్న ఒక ప్రమాద బీమా పాలసీ కోసం ఏడాదికి  రూ.520  కట్టాలి.
  • ఇది తీసుకున్న వారు ప్రమాదంలో చనిపోతే నామినీకి రూ. 10 లక్షలు వస్తాయి.
  • శాశ్వత వైకల్యంతో పాటు శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడితే రూ. 10 లక్షలు వస్తాయి.
  • ఆస్పత్రిలో చేరాక వైద్య ఖర్చులలో రూ.లక్ష ఇస్తారు.
  • పాలసీదారు చనిపోతే.. పిల్లల విద్యా ప్రయోజనాలకు రూ.లక్ష ఇస్తారు.

ఏటా రూ.320 చెల్లిస్తే.. 

  • టాటా ఏఐజీతో కలిసి తపాలాశాఖ అందిస్తున్న  ఒక  ప్రమాద బీమా పాలసీ కోసం ఏడాదికి రూ. 320 చెల్లించాలి.
  • పాలసీదారుడు ప్రమాదంలో మృతిచెందితే నామినీకి రూ. 5 లక్షలు అందుతాయి.
  • శాశ్వత వైకల్యం లేదా పాక్షిక వైకల్యం ఏర్పడినా రూ.5 లక్షలు అందుతాయి.
  • ఆస్పత్రిలో చేరాక వైద్య ఖర్చులలో రూ. 50 వేలు ఇస్తారు.