Telangana: తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఖరీదైన కార్లు, బైకులకు ప్రత్యేక నంబర్ల కోసం వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా లక్షల్లో డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో ఫ్యాన్సీ నంబర్లతో తెలంగాణ రవాణాశాఖకు భారీగా ఆదాయం చేకూరింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి శనివారం(ఈరోజు) ఒక్క రోజే రూ.3.71 కోట్ల ఆదాయం వచ్చింది. టీజీ09 ఎఫ్ 0001 నంబర్‌ను రూ.7.75 లక్షలకు సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ దక్కించుకున్నారు. టీజీ09 ఎఫ్ 0009 నంబర్‌ను రూ.6.70 లక్షలకు కమలయ్య హై సాఫ్ట్ సంస్థ కొనుగోలు చేసింది. టీజీ09 ఎఫ్9999 నంబర్‌ను రూ.99,999కు ఇకో డిజైన్ స్టూడియో దక్కించుకుంది.
ఖైరతాబాద్‌లో ప్రత్యేక సంఖ్యల వేలం నివేదిక
మొత్తం బిడ్ విలువ – రూ.3,715,645
ఫ్యాన్సీ నెంబర్ – TG 09 F0001
మొత్తం బిడ్ అమౌంట్:- రూ. 775,000
యజమాని పేరు: నందమూరి బాలకృష్ణ
సంఖ్య- TG 09 F 0009
మొత్తం బిడ్ అమౌంట్:- రూ. 670,000
యజమాని పేరు : కమలయ్య్ హైసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్
సంఖ్య- TG 09 E 9999
మొత్తం బిడ్ అమౌంట్ – రూ.99,999
యజమాని పేరు : ఎకో డిజైన్ స్టూడియో
సంఖ్య- TG 09 F 0005
మొత్తం బిడ్ అమౌంట్:- రూ. 149,999
యజమాని పేరు: జెట్టి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
సంఖ్య- TG 09 F 0007
మొత్తం బిడ్ అమౌంట్:- రూ.137,779
యజమాని పేరు: కె.శ్రీనివాస్ నాయుడు
సంఖ్య- TG 09 F 0019
మొత్తం బిడ్ అమౌంట్:- రూ. 60,000
యజమాని పేరు : నేత్రావతి బ్బు బాలగప్ప శివాలింగప్ప
సంఖ్య- TG 09 F 0099
మొత్తం బిడ్ అమౌంట్:- రూ.475,999
యజమాని పేరు: కాన్‌క్యాప్ ఎలక్ట్రికల్ ప్రైవేట్ లిమిటెడ్
కాగా, ఫ్యాన్సీ నంబర్లను పొందేందుకు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై వేలం ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఇది పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతుంది. రవాణాశాఖ ఆధికారుల ప్రకారం, ప్రజల నుంచి స్పందన అనూహ్యంగా ఉందని వారు తెలిపారు. అత్యధిక ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ రవాణాశాఖ భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేక నంబర్లను విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. త్వరలోనే “గోల్డెన్ సిరీస్” అనే కొత్త కేటగిరీ ప్రారంభించే అవకాశముంది. ఈ విధంగా ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రాష్ట్రానికి ఆదాయం రావడమే కాక, ప్రజల లోని ఆసక్తిని కూడా ఉపయోగించుకోవడం గమనార్హం.