Rs 500 Notes Alert : రూ.500 నోట్లు.. బీ అలర్ట్

రూ.2000 నోట్లు మార్కెట్ నుంచి వెళ్లిపోతున్న ఈ తరుణంలో రూ.500 నోట్లపై (Rs 500 Notes Alert) లావాదేవీలు భారీగా పెరగనున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు చాలా అలర్ట్ గా ఉండాలి.

  • Written By:
  • Publish Date - May 23, 2023 / 10:20 AM IST

రూ.2000 నోట్ల ఉపసంహరణ ప్రక్రియ ఈరోజు (మంగళవారం)  మొదలైంది. ఆ నోట్లను బ్యాంకుల ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)  వెనక్కి తీసుకునే ప్రక్రియ స్టార్ట్ అయింది.  సెప్టెంబర్ 30 వరకు ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. రూ.2000 నోట్లు మార్కెట్ నుంచి వెళ్లిపోతున్న ఈ తరుణంలో రూ.500 నోట్లపై (Rs 500 Notes Alert) లావాదేవీలు భారీగా పెరగనున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు చాలా అలర్ట్ గా ఉండాలి. నకిలీ కరెన్సీ ముఠాలు నకిలీ  రూ.500 నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు ఈ టైం ను వాడుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రూ.500 నోట్ల (Rs 500 Notes Alert) పోలికల గురించి మనకే కనీస అవగాహన ఉండాలి. నకిలీ 500 నోటుకు.. అసలు 500 నోటుకు ఉండే తేడా ఏంటో తెలుసుకోవాలి. ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయాలి.

500 నోటులో ఇవన్నీ ఉంటాయి.. 

→   రూ.500 నోటుపై మహత్మా గాంధీ బొమ్మ, ఆర్‌బీఐ గవర్నర్ సంతకం ఉంటాయి.

→ రూ.500 నోటుపై  మరో వైపున రెడ్‌ ఫోర్ట్ బొమ్మ ఉంటుంది.

→  రూ. 500 నోట్లపై జియోమెట్రిక్ ప్యాట్రన్స్ ఉంటాయి.

→  రూ.500 నోట్లు స్టోన్ గ్రే కలర్‌లో ఉంటాయి.

→  రూ.500 నోట్ల సైజ్ 66 ఎంఎం ×  150 ఎంఎం ఉంటుంది. మధ్యలో మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది.

→  రూ.500 నోట్లపై  500 అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది.

→  రూ.500 నోట్లపై  భారత్, ఇండియా అని చిన్న అక్షరాల్లో రాసి ఉంటుంది.

also read : 2000 Notes: నేటి నుంచే బ్యాంకుల్లో రూ. 2000 నోట్ల మార్పిడి.. ఇవి తెలుసుకోండి..!

→  రూ.500 నోట్లపై  500 అనే మార్క్ ఉంటుంది.

→ రూ.500 నోటు ముందు భాగంలో తెల్ల స్థలంలో 500 అని ఉంటుంది. అయితే దీన్ని లైట్‌కు పెట్టి చూడాలి. ఇండియా, ఆర్‌బీఐ అని రాసి ఉండే ఒక స్ట్రిప్ ఇందులో ఉంటుంది. ఈ స్ట్రిప్ కలర్ గ్రీన్, బ్లూ లాగా మారుతుంది.

→ రూ.500 నోట్లపై  మహాత్మా గాంధీ బొమ్మకు కుడి వైపున గవర్నర్ సంతకం, గ్యారంటీ క్లాజ్, ప్రామిస్ క్లాజ్ ఉంటాయి. ఆర్‌బీఐ ఎంబ్లెమ్ కూడా ఉంటుంది.

→  రూ.500 నోట్లపై  మహాత్మా గాంధీ బొమ్మ, ఎలెక్ట్రోటైప్ 500 వాటర్‌మార్క్ చేసి ఉంటారు.

→ రూ.500 నోట్లపై  మహాత్మా గాంధీ బొమ్మ కింద హిందీ, ఇంగ్లీష్‌లో మహాత్మా గాంధీ అని రాసి ఉంటుంది.

→ రూ.500 నోటుకు కుడి వైపున అశోకుడి స్తంభం ఉంటుంది. దీనిపై రూ.500 చిన్న రౌండ్‌లో రాసి ఉంటుంది. ఎడమ వైపు పైన, కుడి వైపున కింద కరెన్సీ నోటు నెంబర్లు ఉంటాయి.

→ నోటు పైన కుడి, ఎడమ వైపున రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. దీనికి మధ్యలో ఐదు వందలు అని హిందీలో రాసి ఉంటుంది.

→ నోటు వెనుక భాగంలో చూస్తే.. ఎడమ వైపున తెల్ల స్థలంలో గాంధీ బొమ్మ, 500 ఉంటాయి.

→ స్వచ్ఛ్ భారత్ అని కళ్లజోడులో హిందీలో రాసి ఉంటుంది. దీని కింద రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అని హిందీలో ఉంటుంది. ఐదు వందలు అని వివిధ భాషల్లో రాసి ఉంటుంది. రెడ్ ఫోర్ట్ ఉంటుంది.