BJP : మా అభ్యర్థులకు రూ.15 కోట్లు ఆఫర్‌: ఆప్‌ ఆరోపణలు

ఓడిపోతామని తెలిసే బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని సింగ్ మండిపడ్డారు. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే.. ఓట్ల లెక్కింపునకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది.

Published By: HashtagU Telugu Desk
Rs 15 crore offer to our candidates: AAP allegations

Rs 15 crore offer to our candidates: AAP allegations

BJP : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఏడుగురు ఆప్ అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేసిందని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. పోలింగ్ ముగియగానే బీజేపీ నుంచి సదరు అభ్యర్థులకు కాల్స్ వచ్చాయని, ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఆఫర్ చేశారని పేర్కొన్నారు. కానీ ఆప్ అభ్యర్థులు ఆ ఆఫర్‌ను తిరస్కరించారని చెప్పారు. ఓడిపోతామని తెలిసే బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని సింగ్ మండిపడ్డారు. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే.. ఓట్ల లెక్కింపునకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది. ఢిల్లీలోనూ పార్టీలను విచ్ఛిన్నం చేసే రాజకీయాలను మొదలు పెట్టిందన్నారు.

Read Also: Viswak Sen : బాస్ ఈజ్ బాస్.. నాకు తెలిసింది మా ఇంటి కాంపౌండే..!

ఇకపై అటువంటి ఫోన్‌ కాల్స్‌ ను రికార్డు చేయాలని, ఒకవేళ నేరుగా భేటీ ఐతే సీక్రెట్‌ కెమెరా లతో వాటిని చిత్రీకరించాలని ఎమ్మెల్యేలకు సూచించామన్నారు. బీజేపీ నేతల నుంచి తమ పార్టీ అభ్యర్థులకు ఫోన్‌కాల్స్‌ వచ్చాయని సంజయ్‌ చెప్పినప్పటికీ ఎవరు చేశారనే విషయాన్ని ఆయన వెల్లడిరచలేదు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బుధవారం (ఫిబ్రవరి 5) పోలింగ్ జరిగింది. మొత్తం 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి మాత్రం బీజేపీ అధికారంలోకి రాబోతుందని సర్వేలు తేల్చాయి. అయితే ఈ సర్వేలను ఆప్ తోసిపుచ్చింది.

ఇకపోతే.. గతంలో కూడా ఎప్పుడూ ఆప్ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్పలేదని.. కానీ అధికారంలోకి వచ్చామన్నారు. ఇప్పుడు కూడా సర్వేలు అవే చెబుతున్నాయని.. కానీ అధికారంలోకి వచ్చేది మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీనేనని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ శనివారం ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఈసారి కూడా కాంగ్రెస్‌కు జీరో సీట్లే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి.

Read Also: Yashasvi Jaiswal Catch: జైస్వాల్ అద్భుత క్యాచ్, ఇంటర్నెట్ షేక్

 

  Last Updated: 06 Feb 2025, 07:32 PM IST