Site icon HashtagU Telugu

Bravery: రైల్వే ట్రాక్ పై పడిపోయిన మహిళను కాపాడిన RPF కానిస్టేబుల్

Constable Saves

Constable Saves

వరంగల్: రైల్వే స్టేషన్‌లో సోమవారం సాయంత్రం రైల్వే ట్రాక్‌పై జారిపడబోయిన మహిళా ప్రయాణికుడిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడాడు. సుమారు 20 మంది ప్రయాణికులు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి నుండి వరంగల్‌కు తిరిగి వస్తున్నారు. వారిలో భీమారం గ్రామానికి చెందిన పార్వతి (53) అనే మహిళా ప్రయాణికులు రైలు కదలకముందే దిగలేకపోయారు.

ఫుట్ బోర్డుకు వేలాడుతున్న ఆమె నడుస్తున్న రైలు నుంచి దూకింది. దీనిని గమనించిన డ్యూటీ కానిస్టేబుల్ చిన్నరామయ్య వెంటనే స్పందించి తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ మహిళను రక్షించాడు. చిన్నరామయ్య వేగంగా స్పందించకుంటే ఆమె ప్లాట్‌ఫారమ్‌పై నుంచి ట్రాక్‌పైకి జారిపోయేది. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చిన్న రామ‌య్య జాతీయ స్థాయి అథ్లెట్ . అతని సాహసానికి రైల్వే అధికారులు, ప్రయాణికులు అభినందనలు తెలిపారు.

Exit mobile version