సాధారణంగా చాలామందికి పంటలు పండించడం అంటే ఇష్టం. మరీ ముఖ్యంగా సిటీలలో ఉండేవారు అయితే ఇలా పంటలు పండించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. కానీ వారికి ఆ అవకాశం లేకపోవడంతో ఇంటి చుట్టూ ఇంటి పైన ఇలా ప్రతి చోటా కూడా కూరగాయల మొక్కలను పూల మొక్కలను పెంచుతూ ఉంటారు. ఇలా ఎక్కువగా జపాన్ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్లు వాళ్లకు కావాల్సిన కూరగాయలు అన్నీ కూడా ఇంటి సమీపంలోనే పండించుకుంటూ ఉంటారు.
అయితే తాజాగా ఢిల్లీకి చెందిన రాజ్ కుమార్ రావత్ అనే ఒక వ్యక్తి కూడా తన ఇంటి డాబాని ఏకంగా వ్యవసాయ క్షేత్రంగా మార్చేశాడు. రాజ్ కుమార్ కి కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టమట. అయితే అతనికి పొలాలకు వెళ్లి సాగు చేసే అంత పరిస్థితి లేకపోవడంతో ఇంటి డాబాపై కూరగాయల మొక్కలు పెంచాలి అనుకొని తన ఇంటి డాబాని మొత్తం ఏకంగా వ్యవసాయ క్షేత్రంగా మార్చేశారట. అతనితో పాటు అతని పిల్లలకు కూడా ఈ విధంగానే నేర్పించారట. ఉత్తరాఖండ్ లోని పారిగర్వాల్ కీ చెందిన రాజ్ కుమార్ తన ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు.
ఆయన తండ్రి జగ్ మోహన్ సింగ్ ఒక సైనికుడు. అందువల్ల అతను తండ్రితో కలిసి దేశంలోని వేరు వేరు ప్రాంతాలకు వెళ్లేవాడు రాజ్ కుమార్. అలా చిన్నప్పుడు పంజాబ్ లో ఉంటూ వ్యవసాయాన్ని చాలా దగ్గరగా చూసాడట. అలా అతనికి తెలియకుండానే వ్యవసాయంపై ప్రేమను పెంచుకున్నారట. రాజ్ కుమార్ ప్రస్తుతం గుర్గావ్ లోని ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, ఢిల్లీలోని తన ఇంటిపై ఆర్గానిక్ గార్డెనింగ్ చేస్తున్నాడు. అలా సాగు చేయడం అతనికి కరోనా సమయంలో బాగా కలిసి వచ్చిందట. కరోనా సమయంలో వీలైనంత ఎక్కువసేపు మొక్కలతో గడిపే అవకాశం వచ్చిందట. అయితే రాజ్ కుమార్ తన వ్యవసాయంలో పురుగుల మందులు కానీ రసాయనాలు కానీ వాడకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాడట. ఫలితంగా ఇల్లు మొత్తం గ్రీన్ హౌస్ లా మారిపోయి ఎటు చూసినా కూడా గుబురుగా మొక్కలు చివరకు పక్షులు కూడా అక్కడికి వచ్చి గుళ్ళు కట్టుకుంటున్నాయట.