Rohit Vemula : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసిన రోహిత్‌ వేముల తల్లి

  • Written By:
  • Publish Date - May 4, 2024 / 11:57 AM IST

HCU student Rohit Vemula suicide case: తెలంగాణ పోలీసులు(Telangana Police)హెచ్‌సీయూ విద్యార్థి(HCU student) రోహిత్‌ వేముల(Rohit Vemula) ఆత్మహత్య కేసు(suicide case)ను క్లోజ్ చేశారు. అయితే ఈ విషయంపై రాధిక వేమల(Radhika Vemala) సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy)ని కలుసుకున్నారు. తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణమైన వారికి చట్టపరంగా శిక్ష పడేలా చూడాలని ఆమె అభ్యర్థించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డికి ఓ వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై సీఎం స్పందిస్తూ.. రోహిత్ వేముల ఆత్మహత్య కేసు ఇప్పటికే రీఓపెన్ చేయించామని వివరించారు. రోహిత్ మరణానికి కారణమైన వాళ్లకు శిక్ష పడేలా చూస్తామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేసును రీ ఓపెన్ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి రాధిక వేముల కృతజ్ఞతలు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, రోహత్‌ వేముల రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని శుక్రవారం పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణకు రాగా.. ఆధారాలు లేవని కేసు క్లోజ్ చేశారు. అంతేగాక, రోహిత్ దళితుడు కాదని పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్యకు అప్పటి హెచ్‌సీయూ వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. యూనివర్సిటీ నిబంధనలకు లోబడే వైస్ ఛాన్సలర్ చర్యలు తీసుకున్నారని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. అంతేగాక, రోహిత్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. తన కులానికి సంబంధించిన విషయంలోనే రోహిత్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పేర్కొన్నారు.

Read Also: Anchor Shyamala : యాంకర్ శ్యామల సినీ కెరియర్ అంతే సంగతా..?

అయితే, రోహిత్ వేముల ఆత్మహత్య కేసును క్లోజ్ చేయడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో కేసును మరోసారి దర్యాప్తు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. కేసును రీఓపెన్ చేయాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తా నిర్ణయించారు. ఈ క్రమంలోనే కేసు పునర్విచారణకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర పోలీసు శాఖ పిటిషన్ దాఖలు చేసింది.