Site icon HashtagU Telugu

Google Chrome: ఈ బ్రౌజర్‌ చాలా డేంజర్ గురు.. గూగుల్ క్రోమ్‌లో 300పైగా లోపాలు!

Google Chrome Users

Google Chrome

Google Chrome:  గూగుల్ క్రోమ్..ఈ యాప్ ని నిత్యం కొన్ని లక్షలాది మంది వినియోగదారులు ఉపయోగిస్తూనే ఉంటారు. విక్రమ్ యాప్ ద్వారా ఎంతో మంది వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ యాప్ ని ఒక్క విషయం కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా గూగుల్ క్రోమ్ కి సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. కాకా ఆ వార్త విన్న వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు..అట్లాస్ వీపీఎన్ కొత్త నివేదిక ప్రకారం..గూగుల్ క్రోమ్ అత్యంత డేంజరస్ బ్రౌజర్‌గా మారింది.

కాగా 2022 వరకు మొత్తం ఈ గూగుల్ క్రోమ్ లో 3,159 లోపాలలో 303 లోపాలు కనుగొనబడ్డాయట. ఇకపోతే ఈ అట్లాస్ వీపీఎన్ అనేది మీ ఐపీ చిరునామాను మార్చడం అలాగే మీ కనెక్షన్‌లను గుప్తీకరించడం ద్వారా ఆన్‌లైన్‌ లో ప్రైవేట్ బ్రౌజింగ్‌ ను నిర్ధారించే ఒక యాప్. ఈ అట్లాస్ వీపిఎన్ గణాంకాలు ప్రకారం జనవరి 1, 2022 నుండి అక్టోబర్ 5, 2022 వరకు VulDB డేటాబేస్ ఆధారంగా రూపొందించబడ్డాయి. అయితే గూగుల్ క్రోమ్ వెర్షన్ 106.0.5249.61కి అప్ డేట్ చేయడం ద్వారా వీటిని పరిష్కరించుకోవచ్చు. ఈ నివేదిక ప్రకారం అక్టోబర్‌లో ఐదు కొత్త లోపాలను కలిగి ఉన్న ఏకైక బ్రౌజర్ గూగుల్ క్రోమ్ .

సీవీఇ ఈ నెల క్రోమ్ లో CVE-202203318, CVE-2022-3314, CVE-2022-3311, CVE-2022-3309, CVE-2022-3307 లోపాలను కనుగొనబడింది. సీవీఈ ప్రోగ్రామ్ బహుళ ప్లాట్‌ఫారమ్‌లలో భద్రతా లోపాలు, దుర్బలత్వాలను ట్రాక్ చేస్తుందట. కాగా మొజిల్లా యొక్క ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ 117 లోపాలతో రెండవ స్థానంలో ఉంది. ఇక అక్టోబర్ 5 నాటికి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో 103 లోపాలు నివేదించబడ్డాయి. ఇది 2021 లో 61 శాతం కంటె ఎక్కువ. అయితే మొత్తంగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ విడుదలైనప్పటి నుండి 806 లోపాలను కనుగొంది.