#RIPTwitter: ట్రెండింగ్ లో రిప్ ట్విట్టర్… సామూహిక రాజీనామాలు.. ఆఫీసులకు తాళాలు..!!

ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఆఫీసులకు తాళాలు పడుతున్నాయి. ఉద్యోగులకు నవంబర్ 21 వరకు బ్యాడ్జ్ యాక్సెస్ ను తొలగించింది కంపెనీ.

  • Written By:
  • Updated On - November 18, 2022 / 11:45 AM IST

ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఆఫీసులకు తాళాలు పడుతున్నాయి. ఉద్యోగులకు నవంబర్ 21 వరకు బ్యాడ్జ్ యాక్సెస్ ను తొలగించింది కంపెనీ. ట్విట్టర్ ను ఎలన్ మస్క్ హస్తగతం చేసుకున్న తర్వాత భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే టాప్ పోస్టుల్లో ఉన్న ఉద్యోగులతోపాటు వేల సంఖ్యలో సాధారణ ఉద్యోగులను కూడా తొలగించారు మస్క్. దీంతో పెద్దెత్తున దుమారం రేగుతోంది. భారత్ లో 90శాతం మందిని తొలగించింది ట్విట్టర్. ట్విట్టర్ కార్యాలయాలకు తాత్కాళికంగా తాళాలు పడ్డాయి.

కష్టపడిపని చేయండి లేదంటే ఉద్యోగం మానేయండంటూ ఎలన్ మస్క్ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. కష్టపడి పనిచేయాలంటూ మస్క్ పెట్టిన కండిషన్ కు అంగీకరించడమా లేదా ఉద్యోగం మానేయడమా అనే నిర్ణయంపై ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆఫీసులు మూసివేస్తున్నరన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ ఆఫీసుల మూసివేతతో ట్విట్టర్ లో రిప్ ట్విట్టర్ తో ట్రెండ్ అవుతోంది. ఉద్యోగులతోపాటు నెటిజన్లు కూడా హ్యాష్ ట్యాగ్ లో ట్వీట్స్ చేస్తున్నారు.