7000 Crores – 3 Days : ఒకేచోట 3 రోజుల్లో రూ.7వేల కోట్ల లగ్జరీ ఫ్లాట్లు కొనేశారు

7000 Crores - 3 Days : విలాసవంతమైన ఇళ్లకు గిరాకీ అమాంతం పెరుగుతూపోతోంది.

  • Written By:
  • Publish Date - January 9, 2024 / 07:54 AM IST

7000 Crores – 3 Days : విలాసవంతమైన ఇళ్లకు గిరాకీ అమాంతం పెరుగుతూపోతోంది. భారతీయ ధనవంతులు లగ్జరీ అపార్టమెంట్లలో ఫ్లాట్లలను కొనేందుకు పోటీ పడుతున్నారు.  మంచి లొకేషన్, మంచి నిర్మాణం ఉంటే ఎంతైనా డబ్బు పెట్టడానికి వెనుకాడటం లేదు. మనదేశంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్ ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో అత్యంత విలువైన రెసిడెన్షియల్ ప్రాజెక్టు  ‘డీఎల్ఎఫ్ ప్రివానా సౌత్’‌ను మొదలుపెట్టింది.  ఇందులో అన్నీ లగ్జరీ ఫ్లాట్లే ఉంటాయి. ఈ ప్రాజెక్టు ప్రీ లాంచ్‌‌లో భాగంగా లగ్జరీ ఫ్లాట్లపై ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించారు. దీంతో ఎంతోమంది ప్రవాస భారతీయులు, సంపన్నులు క్యూ కట్టి మరీ వాటిని కొనేశారు. కేవలం 3 రోజుల వ్యవధిలో 1,113 విలాసవంతమైన ఫ్లాట్లను  దాదాపు రూ.7,200 కోట్లకు(7000 Crores – 3 Days) డీఎల్ఎఫ్ విక్రయించింది. ఈ లగ్జరీ ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారిలో 25 శాతం మంది  ప్రవాస భారతీయులే కావడం విశేషం.

We’re now on WhatsApp. Click to Join.

  • ‘డీఎల్ఎఫ్ ప్రివానా సౌత్’‌  ప్రాజెక్టును 25 ఎకరాల్లో డీఎల్ఎఫ్ కంపెనీ నిర్మించనుంది.
  • ఈ ప్రాజెక్టులోని 7 టవర్లలో ఉన్న లగ్జరీ ఫ్లాట్లలో ఒక్కోదానిలో నాలుగు బెడ్ రూమ్స్, పెంట్‌హౌస్ యూనిట్లు ఉంటాయి.
  • ‘డీఎల్ఎఫ్ ప్రివానా సౌత్’‌‌లోని  ఏడు టవర్లలో 1,113 లగ్జరీ హోమ్స్ ఉంటాయి.
  • ఇందులోని ఒక్కో ఫ్లాట్ బుకింగ్‌ ధర రూ.50 లక్షలు. ఒకేసారి ఒకటికి మించి బుకింగ్స్ చేసుకోలేరు. ఒక ఫ్లాట్‌ను మాత్రమే బుక్‌ చేసుకోవాలి.

Also Read: Earthquake : తీవ్ర భూకంపం.. ఇళ్ల నుంచి జనం పరుగులు 

టాప్ గేర్ లో లగ్జరీ కార్ల సేల్స్

గ‌తంతో పోలిస్తే ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా విశాలమైన స్పేస్ గ‌ల ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి త‌ర్వాత యువ ప్రొఫెష‌న‌ల్స్ లైఫ్ స్ట‌యిల్‌లో మార్పులు వ‌చ్చాయి. హై ఎండ్ కార్లు, ల‌గ్జ‌రీ కార్ల వైపు మొగ్గుతున్నారు. కొవిడ్‌-19 మ‌హ‌మ్మారికి ముందు అంటే 2019లో ప్ర‌తి రోజూ రూ.50 ల‌క్ష‌ల పై చిలుకు గ‌ల ధ‌ర గ‌ల కార్లు 95 అమ్ముడైతే 2023లో స‌గ‌టున 128 కార్లు అమ్ముడ‌య్యాయి. దీనికి ప్ర‌తి ఒక్క‌రి ఆదాయం పెర‌గ‌డం కూడా దీనికి మ‌రో కార‌ణం అని తెలుస్తోంది. ఆటోమొబైల్ ఇండ‌స్ట్రీ అంచ‌నాల మేర‌కు 2023లో 46 వేల నుంచి 47 వేల ల‌గ్జ‌రీ కార్లు అమ్ముడ‌య్యాయి. 2022తో పోలిస్తే 21 శాతం (38 వేలుకు పైగా), కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ‌చ్చిన 2019కి ముందుతో పోలిస్తే గ‌తేడాది 35 శాతం పై చిలుకు లగ్జ‌రీ కార్ల విక్ర‌యాల్లో గ‌ణ‌నీయ వృద్ధిరేటు న‌మోదైంది. వీటిల్లో మెర్సిడెజ్‌-బెంజ్‌, బీఎండ‌బ్ల్యూ కార్లు మొద‌టి స్థానంలో ఉంటాయి. 2023లో కార్ల విక్ర‌యాల గ‌ణాంకాల‌ను ఈ రెండు సంస్థ‌లు ప్ర‌క‌టించ‌లేదు కానీ, మ‌రో ల‌గ్జ‌రీ కార్ల త‌యారీ సంస్థ ఆడి ఇండియా 2022తో పోలిస్తే 2023లో 89 శాతం సేల్స్ పెరిగాయి. 2022లో 4,187 కార్లు విక్ర‌యించిన ఆడి ఇండియా.. 2023లో 7,931 యూనిట్ల‌ను విక్ర‌యించింది. ఇది ఓవరాల్ ఇండ‌స్ట్రీ గ్రోత్‌ను దాటేసింది.