Site icon HashtagU Telugu

KTR : రేవంత్‌రెడ్డి ప్రైవేటు ముఠాలా పని చేస్తున్న పోలీసులు: కేటీఆర్‌

Revanth Reddy, police are working like a private gang: KTR

Revanth Reddy, police are working like a private gang: KTR

KTR : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ఖర్మ తమకు లేదని అన్నారు. బంగ్లా తరహాలో జనమే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని పడగొడతారు. ఎంతో మంది నియంతలకు ప్రజలకు గుణపాఠం చెప్పారు. మరొకరు సీఎం స్థానంలో ఉంటే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో రాజీనామా చేసేవారు. రేవంత్‌రెడ్డికి ధైర్యం ఉంటే భద్రత లేకుండా జనంలోకి వెళ్లాలి.

Read Also: Heart Attack: గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించే మందులివే!

రేవంత్‌రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నా. మళ్లీ 20 ఏళ్ల వరకు ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయరు. ప్రజలకు కూడా అన్ని విషయాలు అర్థం కావాలి. సీఎం ఆర్థిక దోపిడీ, పర్యావరణ విధ్వంసంపై సిట్టింగ్‌ జడ్జి లేదా స్వతంత్ర దర్యాపు సంస్థతో విచారణ చేయాలి. ఇష్టానుసారం కేసులు పెట్టిన వారిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. రేవంత్‌రెడ్డి ప్రైవేటు ముఠాలా పని చేస్తున్న పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ఎండగట్టింది. మాటల వేట సీఎందే కానీ.. సీఎస్‌, అధికారులు బలవుతున్నారు. ఐఏఎస్‌, అటవీ అధికారుల వంతైంది.. ఇతర అధికారులూ జాగ్రత్తగా ఉండాలి. రేవంత్‌రెడ్డి సైన్యంలా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారు.

చిత్తశుద్ధి ఉంటే రేవంత్‌రెడ్డి బయటకు రావాలి. ఫార్ములా ఈ రేసులో మంత్రిగా విధాన నిర్ణయాలు తీసుకున్నా అని చెప్పా.. అంతేకానీ అధికారులను బలి చేయలేదు. ఫార్ములా ఈ రేసులో అభ్యంతరం ఉంటే నేను బాధ్యత తీసుకుంటా అని కేటీఆర్‌ తెలిపారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉందా? లేదా? అనే దానిపై నెలాఖరు వరకు ఎదురుచూస్తాం. నెలాఖరులో బీఆర్‌ఎస్‌ భేటీ తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్దకు వెళ్తాం. ఆధారాలతో సహా వాటికి అందజేస్తాం. అప్పటికీ స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో బీజేపీను ఎండగడతాం. రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ కాపాడుతోందని చెప్పాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆర్థిక దోపిడీ, పర్యావరణంపై దాడి విషయంపై ప్రధాని స్పందించాలి. స్పందించకపోతే ఆయనకు కూడా పాపంలో వాటా ఉందని భావించాల్సి వస్తుంది.

Read Also: Congo : కాంగోలో ఘోర పడవ ప్రమాదం.. 50 మంది దుర్మరణం