Ambidexterity: రెండు చేతులతో అద్భుతంగా రాస్తున్న చిన్నారి.. వీడియో వైరల్?

సాధారణంగా మనం ఏదైనా రాసేటప్పుడు లేదంటే బొమ్మలు గీసేటప్పుడు ఎక్కువగా ఒక చేతిని ఉపయోగిస్తూ ఉంటాం.

  • Written By:
  • Publish Date - August 11, 2022 / 10:10 AM IST

సాధారణంగా మనం ఏదైనా రాసేటప్పుడు లేదంటే బొమ్మలు గీసేటప్పుడు ఎక్కువగా ఒక చేతిని ఉపయోగిస్తూ ఉంటాం. రెండవ చేతిని ఉపయోగించి రాయడం చేయడం అన్నవి చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే చాలామంది బొమ్మలు గీసేటప్పుడు లేదంటే రాసేటప్పుడు ఒక చేతిని ఉపయోగించి రాయడం బొమ్మలు వేయడం లాంటివే కష్టంగా భావిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం అవలీలగా రెండు చేతులతో రాయడం, బొమ్మలు గీయడం లాంటివి చేస్తూ ఉంటారు. అటువంటి వారిని చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఇలా రెండు చేతులతో రాయడం, బొమ్మలు గీయడం లాంటివి చేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు.

కాగా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక ఘటన కూడా అలాంటిదే. ఒక చిన్నారి రెండు చేతులను ఉపయోగించి చక చకా పనిచేస్తోంది. పూర్తి వివరాల్లో వెళితే.. రెండు చేతులతో చ‌కచ‌కా రాసేస్తున్న ఈ బాలిక పేరు ఆది స్వ‌రూప‌. క‌ర్ణాట‌క‌ లోని మంగ‌ళూరుకు చెందిన ఈ బాలిక రెండు చేతులతో 11 విభిన్న రీతుల్లో అక్ష‌రాలు రాసేస్తోంది. అది కూడా భలే స్పీడుతో రాస్తోంది. స‌వ్య దిశ‌లో, అప‌స‌వ్య దిశ‌లోనే కాకుండా,ఒక చేతితో స‌వ్య దిశ‌లో మ‌రో చేతితో అప‌స‌వ్య దిశ‌లో రాస్తున్న ఈ బాలిక‌ ఒకేసారి రెండు చేతుల‌తో ఒకే వాక్యాన్ని స‌వ్య‌, అప‌స‌వ్య దిశ‌ల్లో రాసేస్తోంది. అంతేకాదండోయ్‌ ప‌లు క‌న్న‌డ‌, తెలుగు, ఆంగ్లం సహా ప‌లు భాష‌ల్లోనూ చక‌చ‌కా రాసేస్తోంది.

 

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోని చూసిన నెటిజెన్స్ ఆ చిన్నారి టాలెంట్ కి ఫిదా అవుతున్నారు. ఇంకొందరు ఆ చిన్నారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే భార‌త వైమానిక ద‌ళానికి చెందిన రిటైర్డ్ ఎయిర్ మార్ష‌ల్ అనిల్ చోప్రా ఈ చిన్నారి వీడియోను సోష‌ల్ మీడియాలో పోప్ట్ చేశారు. అంతేకాకుండా బాలిక‌లోని అద్భుత సామ‌ర్ధ్యాన్ని కూడా వివరిస్తూ 10 ల‌క్ష‌ల మందిలో ఒక‌రికి ఉండే ఈ త‌ర‌హా శ‌క్తిని ఆంబిడెక్సెరిటీగా పిలుస్తార‌ని తెలిపారు. మెద‌డులోని రెండు భాగాలు ఒకేసారి ఒకేలా ప‌నిచేయడం వ‌ల్ల ఈ త‌ర‌హా అద్భుత శ‌క్తి సంక్ర‌మిస్తుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఆది స్వ‌రూప అనే పేరున్న ఈ బాలిక నిజంగానే ఆది స్వ‌రూపిణే అని ఆయ‌న ప్ర‌శంసించారు.