Site icon HashtagU Telugu

Egg Of Sun: కిలో మామిడి రూ.2.70 లక్షలు.. వాటి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Download (1)

Download (1)

మామిడిపండు వేసవి కాలంలో విరివిగా దొరికే ఈ మామిడి పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. మామిడి పండును పండ్లకొ రారాజు అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలామంది ఈ మామిడి పండ్లను అమితంగా ఇష్టపడి తింటూ ఉంటారు. ఎప్పుడెప్పుడు వేసవి కాలం వస్తుందా మామిడి పండ్లు మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇకపోతే మామిడికాయలు కేజీ 100 లేదంటే 200 లేదంటే బాగా డిమాండ్ ఉంటే 400,500 వరకు పలుకుతాయి.

కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే మామిడి పండ్లు మాత్రం ఏకంగా కిలో 2.70 లక్షలు. ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా మీరు విన్నది నిజమే. అయితే ప్రపంచంలో ఎక్కువ తీపిగా ఉండే మామిడిపండు ఏదో తెలుసా అంటే చాలామంది తెగ ఆలోచిస్తూ ఉంటారు. దానికి ఆన్సర్ జపాన్ కు చెందిన మియాజాకీ. ఈ మామిడి పండ్లు పర్పుల్ రంగులో ఉండటమే మరొక ప్రత్యేకత. ఈ మామిడి పండు చాలా ఖరీదైన రకం.అయితే ఈ మామిడి పండు ని జపాన్ లోని మియాజాకీ అనే పట్టణంలో సాగవుతోంది. కనుక దీనిని అదే పేరు పెట్టి పిలుస్తున్నారు. ఈ ఒక్క పండు 350 గ్రాముల వరకు ఉంటుంది.

ఇక ఇందులో చక్కెర పరిమాణం 15 శాతం, రంగు ఆకృతి పరంగా ఈ మామిడిపండును భిన్నంగా ఉండటాన్ని గమనించవచ్చు. ఈ మామిడిపండును జపాన్ వాసులు ఎగ్ ఆఫ్ సన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు సీజన్ లో మియాజాకీ మామిడి పండ్లను దిగుబడికి వస్తాయట. జపాన్ లో ఉన్న ఈ ఏదైనా మామిడి పండు పెద్దమొత్తంలో సాగు అవుతుంది. మొదట ఒకినవా మామిడి పండు తర్వాత రెండవ స్థానంలో దీనిదే. ఇక ఈ మామిడిపండు లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అదేవిధంగా బీటా కెరోటిన్ పోలిక్ యాసిడ్ కూడా లభిస్తాయి. ప్రస్తుతం ఈ మియాజాకీ రకం మామిడి పండ్లను మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఒక రైతు సాగుచేస్తున్నారు. అలా ఈ మామిడిపండ్ల సాగు బంగ్లాదేశ్,థాయిలాండ్,ఫిలిప్పీన్స్ దేశాలకు కూడా పాకిపోయింది.