Russia Ukraine War : 100 రోజుల ర‌ష్యా ఉక్రెయిన్ యుద్ధం.. 243 మంది చిన్నారుల యాదిలో..

యుద్ధం ఎక్కడైన బలయ్యేది ప్రజలే..దాడలు ఎవరివైన దహనమయ్యేది ప్రజలే..

  • Written By:
  • Publish Date - June 3, 2022 / 08:00 PM IST

యుద్ధం ఎక్కడైన బలయ్యేది ప్రజలే..దాడలు ఎవరివైన దహనమయ్యేది ప్రజలే..సంక్షోభం ఏదైనా చస్తూ బతికేది ప్రజలే..తినేందుకు తిండి లేక..ఉండేందుకు చోటు లేక..కంటినిండా కునుకు లేక..కంటిపాపకు రక్షణలేక..ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ చేస్తున్న విధ్వంసం కూడా ఇలాంటిదే. నాటో కూటమిలో చేరొద్దంటూ ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలుపెట్టింది రష్యా. మొదట ఉక్రెయిన్ ను రెండు, మూడు రోజుల్లో దారికి తెచ్చుకోవచ్చనుకున్న రష్యాకు భంగపాటు ఎదురైంది. అలా మొదలుపెట్టిన యుద్ధానికి ఇవాళ్టికి వంద రోజులు పూర్తయ్యాయి. ఈ 100 రోజుల యుద్ధ భ‌యాన‌క దృశ్యాల‌ను కొన్ని ఫోటోల‌లో చూడండి

యుద్ధంలో చ‌నిపోయిన 234మంది పిల్ల‌ల యాదిలో స్కూల్ బ‌స్సులో వారి బ్యాడ్జిలు, బొమ్మ‌లు పెట్టిన యాజ‌మాన్యం

 

ఇళ్లు కోల్పోయి బాంబ్ షెల్ట‌ర్‌లో త‌ల‌దాచుకుంటున్న నిరాశ్ర‌యులు

 

రుబిజీన్ ఏరియాలో మంచినీళ్ల కోసం నిరాశ్ర‌యుల తిప్ప‌లు

యుద్ధంలో నాశ‌న‌మైన వార్ ట్యాంక‌ర్స్‌

యుద్ధంలో ధ్వంస‌మైన చ‌ర్చి

బాంబు దాడుల్లో ధ్వంస‌మైన స్కూలును ప‌రిశీలిస్తున్న సైన్యం

యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్న యుక్రెయిన్ సైనికుడు

Warpics (11)