Phone tapping case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. ఫోన్‌టాపింగ్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో హరీష్‌రావు, రాధాకిషన్ రావుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇరువైపుల వాదనలు ఇప్పటికే ముగియగా.. నేడు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది.
Read Also: Education Department : సంచలనం.. త్వరలోనే ప్రభుత్వ విద్యాశాఖ మూసివేత
కాగా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 2024 డిసెంబర్ 3న హరీశ్ రావుతో పాటు అప్పట్లో ఇంటలిజెన్స్ లో పనిచేసిన రాధాకిషన్ రావుపై ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని కూడా ఆయన అప్పట్లో చెప్పారు. తన వద్ద ఆధారాలను కూడా పోలీసులకు అందించారు. ఈ కేసుపై హరీశ్ రావు గతంలోనే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దని 2024, డిసెంబర్ 5న తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ పిటిషన్ పై ఇరువైపుల వాదనలు ముగియడంతో హరీశ్ రావుపై దాఖలైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ తాజాగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: KTR : నేటి నుండి కేటీఆర్ జిల్లాల పర్యటన !