Mukesh Ambani : ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం గత మూడు నెలల్లో (జులై- సెప్టెంబర్ త్రైమాసికం) 27 శాతం పెరిగింది. కంపెనీకి ఏకంగా రూ.17,394 కోట్ల నికర లాభం వచ్చింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం కేవలం రూ.13,656 కోట్లు. ఆయిల్ అండ్ గ్యాస్, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్, గ్రాసరీ, ఈ-కామర్స్ వ్యాపారాలు డెవలప్ కావడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలు పెరిగాయి. ఇక గత మూడు నెలల్లో రిలయన్స్ గ్రూప్‌కు రూ.2.34 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఇక రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్స్ నికర లాభం రూ.5,297 కోట్లకు చేరుకుంది. 2022- 23 ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో ఇవి రూ. 4,729 కోట్లు. కంపెనీ ఆదాయం 10.7 శాతం పెరిగి రూ.26,875 కోట్లకు చేరింది. దేశవ్యాప్తంగా 5జీ సేవల ఏర్పాటు నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మూల ధన వ్యయాలు రూ.38,815 కోట్లకు పెరిగాయి. అప్పులు రూ. 3.18 లక్షల కోట్ల నుంచి రూ. 2.95 లక్షల కోట్లకు తగ్గాయి. నగదు నిల్వలు రూ.1,77,960 కోట్లుగా(Mukesh Ambani) నమోదయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వారసులు ఈశా అంబానీ, ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీలను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమిస్తూ చేసిన తీర్మానానికి కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు.
- గత ఏడాది రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్ బాధ్యతల్ని ఆకాశ్ అంబానీ స్వీకరించారు.
- గత ఏడాది రిలయన్స్ రిటైల్ బాధ్యతల్ని ఈశా అంబానీ తీసుకున్నారు.
- గత ఏడాది అనంత్ అంబానీ నూతన ఇంధన రంగ బిజినెస్ నిర్వహణను స్వీకరించారు.
Also Read: Kartika Masam : కార్తీకమాసం ఎప్పటి నుంచి ? శివకేశవుల అనుగ్రహం కోసం ఏం చేయాలి ?