Reliance Foundation : వరదల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం అందజేసింది. ఆ కంపెనీ ప్రతినిధులు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి 20 కోట్ల చెక్కును అందజేశారు. తెలంగాణ వరదల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం అందజేసింది. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి రిలయన్స్ ప్రతినిధులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బోర్డు సభ్యుడు పీఎంఎస్ ప్రసాద్, ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మెంటార్ పీవీఎల్ మాధవరావులు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి 20 కోట్ల చెక్కును అందజేశారు. ముంపు గ్రామాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన కోసం ఈ నిధులను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.
Read Also: Punjab BJP: బీజేపీకి బిగ్ షాక్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీనామా
తెలంగాణలో ఇటీవల వచ్చిన వరదలు తీవ్రనష్టాన్ని మిగిల్చాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలు దారుణంగా డ్యామేజ్ అయ్యాయి. వరదల దాటికి హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన రైళ్లు సైతం నిలిచిపోయాయి. మున్నేరు వాగు పొంగడంతో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఆయా ప్రాంతాలు పునరుద్ధరణకు దాతలు ముందుకొస్తున్నారు. వారిలో సినీ, రాజకీయ, బిజినెస్‌మేన్లు మేము ఉన్నామంటూ ముందుకొచ్చి తమ వంతు సాయం చేస్తున్న విషయం తెల్సిందే.