Site icon HashtagU Telugu

Reels : ప్రాణాలు పోతున్నా మీరు మారారా..?

Reels Girl

Reels Girl

ఓ పక్క రీల్స్ పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకొని..ప్రాణాలు పోతున్న యువత మాత్రం మారడం లేదు..ప్రమాదం అని తెలిసిన కానీ సాహసాలు చేస్తూ అందరి చేత ఛీ అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం అంతా సోషల్ మీడియా ట్రెడ్ (Social Media Tread) నడుస్తోంది. దాదాపు అందరికి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. అంతేకాక చాలా మందికి ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి. ఇంకేముందు ఉదయం లేచిన దగ్గరి పడుకునే వరకు అంత సోషల్ మీడియా లో ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా ఇన్ స్టా రీల్స్ చూస్తూ, చేస్తూ సోషల్ మీడియా అనే సముద్రంలో మునిగిపోతున్నారు. కొందరు ఫాలోవర్స్ పెంచుకోవాలని , ఫేమస్ కావాలనే ఉద్దేశ్యం..రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలనే అత్యాశతో రకరకాలుగా రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటీకే రీల్స్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోగా ..మొన్నటికి మొన్న మహారాష్ట్ర లో ఓ యువతీ రీల్స్ చేస్తూ కొండపై కారు నడుపుతూ ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఘటన కు సంబదించిన వీడియో ఇంకా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుండగానే..తాజాగా మరో యువతీ ఓ ఎత్తైన భవనం మీద నుండి కిందకు వేలాడుతూ రీల్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మహారాష్ట్రలోని పుణేలో గల జంబుల్వాడి స్వామినారాయణ టెంపుల్ సమీపంలో ఓ యువతి వీడియో కోసం సాహసమే చేసింది. ఓ భవనంపైకి ఎక్కి మరో యువకుడి చేయి పట్టుకొని వేలాడుతూ వీడియో తీయించుకుంది. పట్టు జారితే కిందికి చేరేలోపే గాల్లో ప్రాణాలు కలిసిపోతాయి. ఈ విషయం వారికీ కూడా తెలుసు..అయినప్పటికీ ఇలా చేసింది. ఈ వీడియో చూసిన వారంతా వావ్ అనడం కాదు.. ఈ వెర్రివేషాలను మానుకోవాలంటూ సూచిస్తున్నారు.

Read Also : Amaravati : రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో నేలపై మోకరిల్లి నమస్కరించిన చంద్రబాబు..