అమెరికా రాష్ట్రం మిచిగాన్‌కి చెందిన ఓ రెడ్డిట్ యూజర్ తనకు రోల్ ఆఫ్ క్వార్టర్స్ లో కనిపించింది అంటూ ఓ నాణెం ఫొటోని రెడ్డిట్ ప్లాట్‌ఫామ్‌లో జూన్ 19, 2022న పోస్ట్ చేశాడు. అయితే ఆ నాణెం ను 1937లో ముద్రించినట్లు సంవత్సరం కూడా ఉంది. పైన లిబర్టీ అని కూడా రాసివుంది. దీన్ని షేర్ చేసిన యూజర్ పేరు జోర్డాన్. ఇలా షేర్ చేయగా వెంటనే ఆ నాణెం పై చర్చ మొదలయ్యాయి.. అతను ఆ నాణెం ఫోటోని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చాడు. నాణెలను చుట్టలను పరిశీలించడం నాకు అలవాటు.
ఖాళీ సమయంలో అలా చేస్తాను. నేను దాదాపు ఓ భారీ సంచిలో పట్టినన్ని క్వార్టర్ రోల్స్‌ని పరిశీలించాను. ఒక్కో రోల్ తెరచి వాటిలో పాత నాణేల్ని గమనించేవాడిని వాటిలో వెండి ఎక్కువగా ఉండేది. ఓ రోల్‌లో ఈ నాణెం కనిపించగానే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే దీనిపై గ్రహాంతరవాసి ముఖం ఉంది. ఇది మిగతా నాణేల కంటే విచిత్రంగా ఉంది అని జోర్డాన్ న్యూస్‌వీక్‌కి తెలిపాడు. జోర్డాన్ ఆ నాణేన్ని తీసుకెళ్లి స్థానిక పాన్ షాప్ డీలర్‌తో చెక్ చేయించగా అప్పుది ఆ డీలర్ ఇది హోబో నికెల్ అని తెలిపాడట.
అయితే ఆ నాణెం ప్రభుత్వం ముద్రించిన కాయిన్ కాదని అమెరికా ప్రభుత్వాన్ని ఏలియన్స్ ఏలట్లేదని ఇది అరుదైన కాయిన్ కూడా కాదని ఇది హోబో నికెల్ కాబట్టి దీని విలువ 10 నుంచి 20 డాలర్లు ఉండొచ్చు అని ఆ డీలర్ చెప్పినట్లు జోర్డాన్ తెలిపాడు.