Fake Notes: కరెన్సీ నోట్లను ఇలా చెక్ చెయ్యండి.. బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు!

తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు పలు కీలక ఉత్తర్వులను జారీ చేసింది.

  • Written By:
  • Updated On - July 2, 2022 / 09:32 PM IST

తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు పలు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. బ్యాంకుల్లో ఒరిజినల్ నోట్లు ఫేక్ నోట్ల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అదేవిధంగా నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా కరెన్సీనట్లు ఉన్నాయా లేవా అన్నది తెలుసుకోవడానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి నోట్ స్టార్టింగ్ మిషన్ లను పరీక్షించాలి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం 2016లో నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి ఆర్బిఐ కొత్త 200, 500,2000 రూపాయల నోట్ల సిరీస్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

కాగా కొత్త సిరీస్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టిన ఆర్.బి.ఐ నోట్ల ప్రామాణికరణ బ్యాంకుల్లో డబ్బులు లెక్కించే ఫిట్నెస్ స్టార్టింగ్ మిషన్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలి అంటూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే ఈ నోట్ స్టార్టింగ్ మిషన్స్ అతేంటికేషన్, అలాగే ఫిట్నెస్ స్టార్టింగ్ పారామీటర్స్ అనే ఆర్బిఐ మార్గదర్శకార ప్రకారం ఫిట్ నోట్ అనేది వాస్తవమైన తగినంత శుభ్రంగా ఉండే నోటని అవి రీసైకిల్ ఇంకా అనుకూలంగా ఉంటుంది అని తెలిపింది ఆర్బిఐ.

ఇకపోతే ఆ నోటు భౌతిక స్థితిని బట్టి అది రీసైక్లింగ్‌కు పనికొస్తాయా? లేదంటే ఆ కరెన్సీ నోట్లను ఆర్బిఐ ఇండియా దశలవారీగా తొలగించి వాటి స్థానంలో కొత్త నోట్లను తయారు చేయించనుంది. రీసైక్లింగ్‌కు అనువుగా ఉన్న నోట్లను తప్పని సరిగా వినియోగించాలని బ్యాంకులకు తెలిపింది. లేదంటే రీ సైక్లింగ్‌ చేయించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది. నోట్ సార్టింగ్ మెషీన్స్ ఫేక్‌ కరెన్సీ నోట్లు, చెలామణికి పనికి రాని నోట్లను గుర్తించి, వాటిని వేరు చేయగలగాని అని ఆర్బిఐ తెలిపింది. ఇలా కరెన్సీ నోట్లను చెక్ చేసి సంబంధిత వివరాలను ఆర్బిఐ కి పంపించాలి అని ఆదేశించింది.