Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!

పూరీలో జగన్నాథ, బలభద్ర, సుభద్ర ఆలయాల్లో ఎలుకల బెడద నెలకొంది.

Published By: HashtagU Telugu Desk
Odisha

Odisha

ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీలో జగన్నాథ, బలభద్ర, సుభద్ర ఆలయాల్లో ఎలుకల బెడద నెలకొంది. రోజూ తెల్లవారుజామున గర్భగుడిని తెరవగానే ఎలుకలు కొరికి వేయడంతో స్వామివార్ల వస్త్రాలు, పూలదండలు ముక్కలు ముక్కలుగా పడివుంటున్నాయి. విగ్రహాలు చెక్కతో చేసినవి కావడంతో మూర్తుల ముఖాలు దెబ్బతింటున్నాయి. ఎలుకల బొరియలతో రాళ్ల మధ్య ఖాళీలు ఏర్పడుతున్నాయని, ఫలితంగా ఆలయ నిర్మాణానికే ముప్పు ఏర్పడిందని పూజారులు హెచ్చరించారు.

దేవుళ్ల దగ్గర పెట్టిన నైవేద్యాలను ఈ ఎలుకలు రాత్రంతా తినేస్తూ… అల్లకల్లోలం చేస్తున్నాయి. అందువల్ల భక్తులే స్వయంగా 2 ఎలుకల యంత్రాలను ఆలయానికి విరాళంగా ఇచ్చారు. దేవతా విగ్రహాలు దెబ్బతింటుండటంతో నిర్వాహకులు ఎలుకలను బంధించే మిషన్ ను ఏర్పాటు చేశారు. ఆ మిషన్ నుంచి హమ్మింగ్ సౌండ్ రావడం వల్ల దేవతామూర్తులకు నిద్రాభంగం కలుగుతుందని ఆలయ అధికారులు చెప్పారు.

కానీ ఇప్పుడు వాటిని వాడకూడదని డిసైడ్ అయ్యారు కాబట్టి.. ఎలుకల్ని పట్టుకోవడానికి….. ఉచ్చులు వేసి.. చిక్కిన ఎలుకల్ని బయట వదిలేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తుల తీసుకుంటున్నట్టు నిర్వాహకులైన జితేంద్ర సాహూ తెలిపారు.

  Last Updated: 24 Mar 2023, 11:39 AM IST